Skip to main content

Team India Players : ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈత‌నే..

టీ20ల్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. టీ20 ఫార్మాట్‌లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్‌ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం ​కాదనలేని సత్యం.
suryakumar yadav india team
suryakumar yadav

ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి.నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్‌ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

☛ T20 Cricketer of the Year: ‘ఐసీసీ టి20 క్రికెటర్‌’ రేసులో సూర్యకుమార్, స్మృతి

360 డిగ్రీస్‌ ప్లేయర్‌గా..

suryakumar yadav t20 record 2022

ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ‍ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు.

☛ ICC T20 Rankings 2022: అగ్రస్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ .. కోహ్లి ర్యాంక్ మాత్రం ఇంతే..

టీ20ల్లో ఎన్నో రికార్డులు..

suryakumar yadav t20 records


ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్‌ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్‌ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్‌ రేట్‌తో 1408 పరుగులు చేశాడు.ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్‌లో 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుం‍డా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్‌.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్‌ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. 

2022 ఏడాది టీ20ల్లో సూర్యకుమార్‌ గణాంకాలు..suryakumar yadav t20 records

☛ వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్‌ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.
☛ శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్‌ రేట్‌తో 34 పరుగులు చేశాడు. 

☛ సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్‌ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
☛ ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్‌ రేట్‌తో 15 పరుగులు చేశాడు. 
☛ ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్‌ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.
☛ ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్‌ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది.
☛ న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది.
☛ బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్‌ రేట్‌తో 30 పరుగులు చేశాడు. 
☛ ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్‌ రేట్‌తో 6 పరుగులు చేశాడు. 
☛ హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్‌ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది.
☛ నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్‌ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది.
☛ పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్‌ రేట్‌తో 46 పరుగులు చేశాడు. 
☛ జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్‌ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూర్యకుమార్‌..
6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్‌ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసియా కప్‌-2022లో సూర్యకుమార్‌..
5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్‌ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ ఉంది.ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్‌ రికార్డుల్లోకెక్కాడు.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

Published date : 31 Dec 2022 07:48PM

Photo Stories