IPL 2024 Auction Records : ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఇతనే.. ? మొత్తం ఎన్ని కోట్లకు అంటే..?
మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. ఇప్పటి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు. ఐపీఎల్-2024 వేలంలో కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
చివరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో భారీ ధరకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్‌కు బాల్‌తోనూ బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. అదే విధంగా ఐపీఎల్-2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2023 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో కమ్మిన్స్ దూరమయ్యాడు. అయితే ఈసారి ఐపీఎల్‌లో ఆడాలని కమ్మిన్స్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్-2024 వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. వేలంలోకి వచ్చిన అతడిపై ఎస్‌ఆర్‌హెచ్ కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక అమ్ముడుపోయిన శామ్ కుర్రాన్ రికార్డును కమిన్స్ బద్దలుకొట్టాడు. సామ్ కుర్రన్..ఐపీఎల్ 2023 వేలంలో రూ.18.25 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. .
☛ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 వేలం పాటలో కోల్‌కత నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
☛ ప్యాట్ కమ్మిన్స్ - రూ.20.50 కోట్లకు (2024, సన్‌రైజర్స్ (SRH), హైదరాబాద్)
☛ సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్)
☛ కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్)
☛ బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్)
☛ క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్)
☛ నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్)
☛ యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్)
☛ పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్)
☛ ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్)
☛ కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ)
☛ బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)
సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..
☛ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 వేలం పాటలో కోల్‌కత నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
☛ 2024 : ప్యాట్ కమ్మిన్స్ - రూ.20.50 కోట్లకు (సన్‌రైజర్స్ (SRH), హైదరాబాద్)
☛ 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్)
☛ 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
☛ 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
☛ 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్)
☛ 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP)
☛ 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
☛ 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)
☛ 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ)
☛ 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్)
☛ 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ)
☛ 2013: గ్లెన్ మ్యాక్స్‌వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్)
☛ 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్‌కే)
☛ 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్)
☛ 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై)
☛ 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్‌కే)
☛ 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్‌కే)
Tags
- ipl price 2024 pat cummins
- pat cummins
- pat cummins records
- pat cummins family
- pat cummins details in telugu
- IPL 2024
- ipl 2024 auction live updates
- auction ipl 2024 players
- srh pat cummins
- ipl 2024 auction updates
- ipl 2024 details in telugu
- pat cummins ipl price 2024 news telugu
- pat cummins ipl history in telugu
- pat cummins ipl records
- pat cummins age
- mitchell starc
- mitchell starc ipl 2024
- mitchell starc ipl 2024 records
- Record-breaking
- Indian Premier League 2023
- Highest-selling player