Skip to main content

ICC Awards 2023: ఐసీసీ వ‌న్డే క్రికెట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి.. పూర్తి జాబితా ఇదే..!

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.
Suryakumar Yadav with the ICC Men's T20 Cricketer of the Year award.  ICC Awards 2023 Winners Full List  Virat Kohli receiving the ICC Men's ODI Cricketer of the Year award.

రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలవగా, టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. 

కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే
గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్‌లో భారత మిడిలార్డర్‌ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది.  

2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా ఇదే..
► య‌మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - ప్యాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత జట్టు కెప్టెన్‌
► మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - విరాట్‌ కోహ్లి(ఇండియా)

Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..

డబ్ల్యూటీసీ టైటిల్‌..
► మెన్స్‌ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - ఉస్మాన్‌ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు - ఆసీస్‌ డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర

ICC Awards 2023 Winners Full List

యశస్విని వెనక్కినెట్టి..
► మెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు.

డచ్‌ జట్టు విజయాలకు కారణం..
► మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - బాస్‌ డి లీడే(నెదర్లాండ్స్‌) - 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి - వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్‌ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర - వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు.

మహిళా క్రికెట్‌లో మహరాణులు..
►వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - నాట్‌ సీవర్‌ బ్రంట్‌(ఇంగ్లండ్‌)
►వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - చమరి ఆటపట్టు(శ్రీలంక) - 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్‌

► వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - హేలీ మాథ్యూస్‌(వెస్టిండీస్‌) - స్టెఫానీ టేలర్‌ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్‌ ప్లేయర్ - టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్‌, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్‌
► వుమెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - ఫోబె లిచ్‌ఫీల్డ్‌(ఆస్ట్రేలియా) - ఆసీస్‌ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు
► వుమెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ - క్వీంటర్‌ అబెల్‌(కెన్యా) - అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు

Bharat Ratna: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..

జింబాబ్వేకే ఆ అవార్డు..
స్పిరిట్‌ ఆఫ్‌ ది క్రికెట్ అవార్డు - జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్‌ ఆటగాడు అకీల్‌ హుసేన్‌ను ఓదార్చినందుకు)
అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్ - రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.

ఐసీసీ టెస్టు జట్టు: 
ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.

ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: 
ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్.

ఐసీసీ 2023 వన్డే జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్:
చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్‌.

ఐసీసీ పురుషుల టీ20 జట్టు: 
యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్‌, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్‌దీప్‌ సింగ్.

Oscar Nominations 2024: ఆస్కార్‌ నామినేషన్స్‌ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!

Published date : 29 Jan 2024 02:46PM

Photo Stories