Skip to main content

T20 Cricketer of the Year: ‘ఐసీసీ టి20 క్రికెటర్‌’ రేసులో సూర్యకుమార్, స్మృతి

ఈ ఏడాది టి20ల్లో ఇచ్చే ‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో సూర్యకుమార్‌ యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు.

పురుషుల కేటగిరీలో భారత డాషింగ్‌ బ్యాటర్‌తోపాటు స్యామ్‌ కరన్‌ (ఇంగ్లండ్‌), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌), సికందర్‌ రజా (జింబాబ్వే) నామినేట్‌ అయ్యారు. ఈ సీజన్‌లో ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ సంచలన బ్యాటర్‌గా ఎదిగాడు. టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో రాణించాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా ఘనత వహించాడు. అంతేకాదు.. మొత్తం 1164 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ అతను రికార్డులకెక్కాడు. 68 సిక్సర్లు బాదిన సూర్య, 187.43 స్ట్రయిక్‌ రేట్‌ నమోదు చేశాడు. సిక్స్‌ల పరంగా తనే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రెండు మెరుపు సెంచరీలు కొట్టిన సూర్య ఖాతాలో మరో తొమ్మిది అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ముంబైకి చెందిన సూర్య ఆ్రస్టేలియా ఆతిథ్యమిచ్చిన‌ టి20 ప్రపంచకప్‌లోనూ మెరిశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగుల సగటుతో మూడు ఫిఫ్టీలు బాదాడు. 189.68 స్ట్రయిక్‌రేట్‌ నమోదు చేశాడు. అసాధారణ ప్రదర్శనతో కెరీర్‌ బెస్ట్‌ టాప్‌ ర్యాంక్‌కు చేరుకోవడమే కాదు.. 890 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకున్నాడు. రెండో ర్యాంకులో ఉన్న రిజ్వాన్‌ (836) అతని దరిదాపుల్లో కూడా లేడు.  
‘ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ రేసులో మాత్రం ఒక్క భారత ప్లేయర్‌ లేడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్, అడమ్‌ జంపా (ఆ్రస్టేలియా), సికందర్‌ రజా (జింబాబ్వే), షై హోప్‌ (వెస్టిండీస్‌) నామినేట్‌ అయ్యారు. 2009లో శివనారాయణ్‌ చందర్‌పాల్‌ తర్వాత షై హోప్‌ రూపంలో వన్డే క్రికెటర్‌ అవార్డు కోసం విండీస్‌ ప్లేయర్‌ నామినేట్‌ కావడం గమనార్హం. ‘ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ రేసులో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (దక్షిణాఫ్రికా), అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌), నాట్‌ సివెర్‌ (ఇంగ్లండ్‌), అలీసా హీలీ (ఆస్ట్రేలియా) ఉన్నారు. త్వరలోనే విజేతల వివరాలను ఐసీసీ ప్రకటించనుంది.   

Suryakumar Yadav: నంబర్‌వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

వరుసగా రెండో ఏడాది.. 
మహిళల విభాగంలో గతేడాది ‘టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయిన భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ ఏడాదీ రేసులో నిలిచింది. తాజా 2022 తుది జాబితాలో నిదా దార్‌ (పాకిస్తాన్‌), సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌), తాహ్లియా మెక్‌గ్రాత్‌ (ఆ్రస్టేలియా)లతో స్మృతి పోటీ పడుతుంది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా ఘనత వహించింది. ఈ సీజన్‌లోనూ తన జోరును కొనసాగించిన ఆమె ఈ ఫార్మాట్ కెరీర్‌లో 2500 పరుగుల్ని పూర్తి చేసుకుంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్, టి20 ఆసియా కప్‌ ఈవెంట్‌లలోనూ మెరుపులు మెరిపించింది. 

 

Published date : 30 Dec 2022 11:45AM

Photo Stories