Skip to main content

ICC T20 ర్యాంకుల్లో సూర్య ‘నంబర్‌ వన్‌’

దుబాయ్‌: టి20 ఫార్మాట్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా చెలరేగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.
Suryakumar Yadav becomes world's No.1 T20I Rankings
Suryakumar Yadav becomes world's No.1 T20I Rankings

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నవంబర్ 2న విడుదల చేసిన టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ సూర్యకుమార్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు ఎగబాకాడు. 

Also read: T20 World Cup Semi Final 2022 Teams : టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌ బెర్తులు ఆసక్తికరం.. గ్రూప్-1,2 లోని జ‌ట్లు..

ఈ ఏడాది ప్రత్యేకించి టి20 ఫార్మాట్‌లో ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న సూర్య... పాకిస్తాన్‌ ఓపెనర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (842 పాయింట్లు)ను వెనక్కినెట్టాడు. నిలకడగా మెరుపులు మెరిపిస్తున్న యాదవ్‌ ఖాతాలో 863 రేటింగ్‌ పాయింట్లున్నాయి. కోహ్లి (897; సెపె్టంబర్‌ 2014లో) తర్వాత రెండో అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లను సూర్యకుమార్‌ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో మొదలైన అతని టి20 ప్రయాణంలో అచిరకాలంలోనే ఒక సెంచరీ, 11 అర్ధసెంచరీలు ఉండటం గొప్ప 
విశేషం. టి20ల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన రెండో భారత బ్యాటర్‌ సూర్యకుమార్‌. 

  • ఈ ఫార్మాట్‌లో కేవలం ‘రన్‌ మెషిన్‌’ కోహ్లి మాత్రమే నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. 
  • భారత స్టార్‌ 2014 నుంచి 2017 డిసెంబర్‌ మధ్య కాలంలో 1013 రోజులు టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంకుల్లో కోహ్లి 638 పాయింట్లతో పదో ర్యాంకులో ఉన్నాడు. 
  • బౌలింగ్‌ జాబితాలో అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (700) తొలి ర్యాంక్‌లో నిలువగా
  • శ్రీలంక స్పిన్నర్‌ హసరంగ (697) రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. గత ప్రపంచకప్‌ సమయంలో శ్రీలంక బౌలర్‌ టాప్‌ ర్యాంకులో ఉన్నాడు. మళ్లీ అగ్రస్థానంపై కన్నేసిన అతనికి రషీద్‌కు మధ్య కేవలం 3 పాయింట్లే తేడా! 
  • భారత బౌలర్లెవరూ టాప్‌–10లో లేరు. అశ్విన్‌ మూడు స్థానాల్ని మెరుగుపర్చుకొని 18వ స్థానంలో ఉన్నాడు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Nov 2022 03:04PM

Photo Stories