Skip to main content

Suryakumar Yadav : సరికొత్త చరిత్ర.. భారతీయ తొలి ఆటగాడిగా సూర్యకుమార్ అరుదైన రికార్డు

టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో సూర్యకుమార్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది.
suryakumar yadav test match in telugu
suryakumar yadav

దీంతో టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న  సూర్యకుమార్‌ కల నేరవేరింది. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డు సాధించాడు.30 ఏళ్ల వయస్సు తర్వాత అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్యకుమార్‌ 30 ఏళ్ల 181 రోజుల వయస్సులో టీ20ల్లో అరంగేట్రం చేయగా.. వన్డేల్లో  30 ఏళ్ల 307 రోజులు, టెస్టుల్లో 32 ఏళ్ల 148 రోజుల వయస్సులో ఎంట్రీ ఇచ్చాడు.

Cricket: ఇండియా నుంచి తొలిప్లేయర్‌ ... స్కై తాజా రికార్డు ఏంటో తెలుసా.?

టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు ఫలించింది. అదే విధంగా జాతీయ జట్టుకు ఆడాలన్న ఆంధ్ర రంజీ ప్లేయర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరు అరంగేట్రం చేశారు.

Team India Players : ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈత‌నే..

గిల్‌కు మొండిచేయి.. 
స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో గురువారం ఆరంభమైన తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. సహచరుల కరతాళ ధ్వనుల నడుమ టీమిండియా క్యాప్‌ అందుకుని మురిసిపోతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక తొలి టెస్టులో ఇక కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. కేఎల్‌ రాహుల్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌ చేయనున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు మొండిచేయే ఎదురైంది.

భారత్‌ Vs ఆస్ట్రేలియా తొలి టెస్టు తుది జట్లు:
టీమిండియా ఆట‌గాళ్లు వీరే :
రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు వీరే..:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

Published date : 09 Feb 2023 03:09PM

Photo Stories