Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత్ బలగం రెడీ.. 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పోటీ
జూలై 26వ తేదీ జరిగే ప్రారంభోత్సవం తర్వాత పారిస్ ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా మొదలవుతాయి. అయితే ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ పోటీలు మాత్రం జూలై 24వ తేదే ఆరంభమయ్యాయి. భారత్ విషయానికొస్తే నేడు ఆర్చరీలో పురుషుల, మహిళల వ్యక్తిగత రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌తో మనోళ్ల సమరానికి తెర లేస్తుంది.
ర్యాంకింగ్ రౌండ్‌లో ఆయా ఆర్చర్లు సాధించిన పాయింట్లు, ర్యాంక్ ఆధారంగానే ఆర్చరీ ప్రధాన పోటీల ‘డ్రా’ను ఖరారు చేస్తారు. కరోనా మహహ్మరి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ ఒక ఏడాది వాయిదాపడి 2021లో జరగ్గా.. భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగారు. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 7 పతకాలు నెగ్గి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ పతకాల పట్టికలో 48వ ర్యాంక్‌లో నిలిచింది. మూడేళ్లు ముగిశాయి. మళ్లీ పారిస్ వేదికగా ఒలింపిక్స్ వచ్చాయి. ఈసారి భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో మొత్తం 117 మంది పోటీపడుతున్నారు.
అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 29 మంది అర్హత సాధించగా.. షూటింగ్‌లో 21 మంది తమ గురికి పదును పెట్టనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులపై ఏకంగా రూ.470 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి భారత క్రీడాకారులు ‘టోక్యో’ ప్రదర్శను అధిగమించి ‘పారిస్’ను చిరస్మరణీయంగా
చేసుకోవాలని, పతకాల పంట పండించి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తూ... ఆల్ ద బెస్ట్!
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు!
అథ్లెటిక్స్ (29)
పురుషుల విభాగం (18): నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), కిశోర్ జేనా (జావెలిన్ త్రో), అక్షదీప్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), పరమ్‌జీత్ సింగ్ బిష్త్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), తజీందర్ పాల్ (షాట్‌పుట్), అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), ప్రవీణ్ చిత్రావెల్ (ట్రిపుల్ జంప్), అజ్మల్ (4×400 మీటర్ల రిలే), అనస్ (400 మీటర్ల రిలే), అమోజ్ జేకబ్ (400 మీటర్ల రిలే), సంతోష్ తమిళరాసన్ (400 మీటర్ల రిలే), రాజేశ్ రమేశ్ (400 మీటర్ల రిలే), మిజో చాకో కురియన్ (400 మీటర్ల రిలే), జెస్విన్ ఆ్రల్డిన్ (లాంగ్‌జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్, సూరజ్ పన్వర్ (మారథాన్ మిక్స్‌డ్ రేస్ వాక్, వికాశ్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్),
మహిళల విభాగం (11): జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్; ఆంధ్రప్రదేశ్), పారుల్ చౌధరీ (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, 5000 మీటర్లు), అన్నురాణి (జావెలిన్ త్రో), విత్యా రాంరాజ్ (4×400 మీటర్ల రిలే), పూవమ్మ రాజు (4x400 మీటర్ల రిలే), దండి జ్యోతిక శ్రీ (4x400 మీటర్ల రిలే; ఆంధ్రప్రదేశ్), శుభా వెంకటేశన్ (4x400 మీటర్ల రిలే), కిరణ్ పహల్ (400 మీటర్లు, 4x400 మీటర్ల రిలే), ప్రాచి (4x400 మీటర్ల రిలే), అంకిత ధ్యాని (5000 మీటర్లు), ప్రియాంక గోస్వామి (20 కిలోమీటర్ల రేస్ వాక్, మిక్స్‌డ్ మారథాన్).
షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 11 వరకు
షూటింగ్ (21)
పురుషుల విభాగం (10): సరబ్‌జోత్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్), అర్జున్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్), అర్జున్ బబూటా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్) సందీప్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్), ఐశ్వర్య ప్రతాప్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), స్వప్నిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), విజయ్‌వీర్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అనంత్ జీత్ (స్కీట్, స్కీట్ మిక్స్‌డ్ టీమ్), పృథ్వీరాజ్ (ట్రాప్).
మహిళల విభాగం (11): మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్), ఇలవేనిల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్), సిఫ్ట్ కౌర్ సమ్రా (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), అంజుమ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), రిథమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్), ఇషా సింగ్ (25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్; తెలంగాణ), రమిత (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్‌డ్ టీమ్), శ్రేయసి సింగ్ (ట్రాప్), రైజా ధిల్లాన్ (స్కీట్ల్), రాజేశ్వరి (ట్రాప్), మహేశ్వరి (స్కీట్, స్కీట్ మిక్స్‌డ్ టీమ్).
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలకు భారీగా నిధులు.. ఖర్చు రూ.470 కోట్లు!!
హాకీ (16)
పురుషుల విభాగం (16): శ్రీజేశ్, హర్మన్‌ప్రీత్, మన్‌ప్రీత్, హార్దిక్, జర్మన్‌ప్రీత్, షంషేర్, మన్‌దీప్, గుర్జంత్, సుఖ్‌జీత్, కృష్ణ బహదూర్, జుగ్‌రాజ్, అమిత్ రోహిదాస్, సుమిత్, వివేక్ ప్రసాద్, అభిషేక్, లలిత్, రాజ్‌కుమార్, సంజయ్, నీలకంఠ శర్మ.
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు
టేబుల్ టెన్నిస్ (8)
మహిళల విభాగం (4): ఆకుల శ్రీజ (సింగిల్స్, టీమ్; తెలంగాణ), మనిక బత్రా (సింగిల్స్, టీమ్), అర్చన (టీమ్), ఐహిక (టీమ్).
పురుషుల విభాగం(4): శరత్ కమల్ (సింగిల్స్, టీమ్), హరీ్మత్ (సింగిల్స్, టీమ్), మానవ్ (టీమ్), సత్యన్ (టీమ్).
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు
బ్యాడ్మింటన్ (7)
పురుషుల విభాగం (4): సాత్విక్ సాయిరాజ్ (డబుల్స్; ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (డబుల్స్), ప్రణయ్ (సింగిల్స్), లక్ష్య సేన్ (సింగిల్స్).
మహిళల విభాగం (3): పీవీ సింధు (సింగిల్స్), అశ్విని పొన్నప్ప (డబుల్స్), తనీషా (డబుల్స్).
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు
ఆర్చరీ (6)
పురుషుల విభాగం (3): బొమ్మదేవర ధీరజ్ (సింగిల్స్, టీమ్, మిక్స్‌డ్ టీమ్; ఆంధ్రప్రదేశ్), తరుణ్‌దీప్ (టీమ్), ప్రవీణ్ (టీమ్).
మహిళల విభాగం (3): దీపిక (టీమ్), అంకిత (టీమ్), భజన్ (సింగిల్స్, టీమ్, మిక్స్‌డ్ టీమ్).
షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు
బాక్సింగ్ (6)
పురుషుల విభాగం (2): నిశాంత్ దేవ్ (71 కేజీలు), అమిత్ (51 కేజీలు).
మహిళల విభాగం (4): నిఖత్ జరీన్ (50 కేజీలు; తెలంగాణ), లవ్లీనా (75 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు).
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..
రెజ్లింగ్ (6)
పురుషుల విభాగం (1): అమన్ (57 కేజీలు).
మహిళల విభాగం (5): వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు).
షెడ్యూల్: ఆగస్టు 5 నుంచి 11 వరకు
స్విమ్మింగ్ (2)
పురుషుల విభాగం (1): శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్).
మహిళల విభాగం (1): ధీనిధి (200 మీటర్ల ఫ్రీస్టయిల్)
షెడ్యూల్: జూలై 28 నుంచి 30 వరకు
సెయిలింగ్ (2)
పురుషుల విభాగం (1): విష్ణు శరవణన్ (ఐఎల్‌సీఏ–7).
మహిళల విభాగం (1): నేత్రా కుమనన్ (ఐఎల్‌సీఏ–6).
షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు
ఈక్వెస్ట్రియన్ (1)
పురుషుల విభాగం (1): అనూశ్ అగర్వల్లా (డ్రెసాజ్).
షెడ్యూల్: ఆగస్టు 4
జూడో (1)
మహిళల విభాగం (1): తులికా మాన్ (ప్లస్ 78 కేజీలు).
షెడ్యూల్: ఆగస్టు 2
రోయింగ్ (1)
పురుషుల విభాగం (1): బల్‌రాజ్ (సింగిల్ స్కల్స్).
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు
టెన్నిస్ (3)
పురుషుల విభాగం (3): రోహన్ బోపన్న (డబుల్స్), శ్రీరామ్ బాలాజీ (డబుల్స్), సుమిత్ నగాల్ (సింగిల్స్)
షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు
గోల్ఫ్ (4)
పురుషుల విభాగం (2): శుభాంకర్, గగన్ జీత్.
మహిళల విభాగం (2): అదితి, దీక్షా.
షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 10 వరకు
వెయిట్‌లిఫ్టింగ్ (1)
మహిళల విభాగం (1): మీరాబాయి చాను (49 కేజీలు).
షెడ్యూల్: ఆగస్టు 7
Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షాట్‌గన్ జట్టు ఇదే..
Tags
- Paris Olympics
- Paris Olympic Games
- India at Paris Olympicsv
- Men's hockey team
- Indian athletes
- 117 athletes
- 16 sports
- Men's team
- Women's Teams
- Boxing
- Swimming
- sports current affairs
- International news
- sakshieducation sports news in telugu
- Paris Olympics 2024
- Olympics Opening Ceremony
- Football Paris Olympics
- Rugby Sevens Paris Olympics
- Archery Paris Olympics
- Men's Recurve Archery
- Women's Recurve Archery
- India Olympics 2024
- Olympic Sports 2024
- Archery Ranking Round
- sakshieducation latest sports news in 2024