వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
1. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల వరకు రుణ ఒప్పందాలు కుదుర్చుకుంది?
ఎ. 13,879 కోట్లు
బి. 13,456 కోట్లు
సి. 12,865 కోట్లు
డి. 12,983 కోట్లు
- View Answer
- Answer: ఎ
2. ఎస్బీఐ తన 3వ ప్రత్యేక స్టార్టప్ బ్రాంచ్ ను ఏ నగరంలో ప్రారంభించింది?
ఎ. కాన్పూర్
బి. చెన్నై
సి. గురుగ్రామ్
డి. లక్నో
- View Answer
- Answer: సి
3. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 7.3 శాతం నుంచి 2022 డిసెంబర్లో ఎంత శాతానికి తగ్గింది?
ఎ: 5.3%
బి. 4.3%
సి. 6.3%
డి. 3.3%
- View Answer
- Answer: బి
4. కిందివాటిలో ఏ సంస్థ ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ సమయాన్ని ఉదయం ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటలకు సవరించింది?
ఎ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
డి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
- View Answer
- Answer: ఎ
4. 2023 ఫిబ్రవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.67 ట్రిలియన్లకు చేరుకున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఎంత శాతం వసూళ్లు పెరిగాయి?
ఎ: 20%
బి. 22%
సి. 24%
డి. 26%
- View Answer
- Answer: సి
5. విదేశీయులకు యూపీఐ యాక్సెస్ ను అనుమతించాలని ఆర్థిక సంస్థలు, ఎన్ పీసీఐల(NPCI)ను ఆదేశించిన సంస్థ ఏది?
ఎ. బ్యాంక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
బి. నీతి ఆయోగ్
సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
6. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించేందుకు 130 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏ రాష్ట్రానికి ఇచ్చేందుకు ఏడీబీ సమ్మతం తెలిపింది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మధ్యప్రదేశ్
సి. ఆంధ్ర ప్రదేశ్
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
7. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విధంగా 2024-25 నాటికి భారత్ రక్షణ ఎగుమతుల లక్ష్యం ఎంత?
ఎ. 1 బిలియన్ డాలర్లు
బి. 1.5 బిలియన్ డాలర్లు
సి. 4 బిలియన్ డాలర్లు
డి. 5 బిలియన్ డాలర్లు
- View Answer
- Answer: డి
8. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ 2021లో భారత్ ఎన్ని అగ్రశ్రేణి దేశాల సరసన చేరింది?
ఎ. 8
బి. 10
సి. 12
డి. 6
- View Answer
- Answer: బి
9. బ్యాంకర్స్ టాప్-500 బ్యాంకింగ్ బ్రాండ్స్- 2020 నివేదిక ప్రకారం బ్రాండ్ విలువలో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన బ్యాంకు ఏది?
ఎ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. ఐసిఐసిఐ బ్యాంక్
సి. ఇండస్ ఇండ్ బ్యాంక్
డి. ఐడిబిఐ బ్యాంక్
- View Answer
- Answer: సి
10. భారత రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలల తర్వాత ఏ నెలలో 6.52 శాతానికి పెరిగింది?
ఎ. మార్చి
బి. జూన్
సి. ఆగస్టు
డి. జనవరి
- View Answer
- Answer: డి