Skip to main content

Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం

ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని మార్చి 12న‌ జాతికి అంకితం ఇచ్చారు.
World`s longest railway platform

పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్‌ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్‌ డ్యామేజ్‌ కంట్రోల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

10 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం
కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 12న ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. కర్ణాటకలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్‌ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్‌ మిషన్‌ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించామ‌న్నారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు.  

అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర
చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ మార్చి 12న మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్‌ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్‌లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్‌ 5న ముగిసింది.

North Korea: చుక్కలు చూపిస్తున్న‌ సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220

Published date : 13 Mar 2023 05:46PM

Photo Stories