Science Seminar: సైన్స్ టీచర్లకు ఆహ్వానం
సైన్స్ బోధనను మరింత సమర్థవంతం చేయడం, నూతన అన్వేషణ నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిఏటా రాష్ట్రస్థాయిలో ఒక ప్రధాన అంశం, వివిధ ఉప అంశాలపై సైన్స్ సెమినార్ నిర్వహిస్తోంది.
ఈసారి కూడా నిర్వహిస్తున్న సెమినార్‌లో పాల్గొనేందుకు పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తోంది. ఎంపికై నవారు ఫిబ్రవరి 24న జరిగే సెమినార్‌లో తమ పరిశోధన పత్రాలను సమర్పించాలని సూచించింది. సైన్స్ సెమినార్‌కు ఎంపిక కావడానికి పరిశోధన పత్రాలను ఫిబ్రవరి 2వ తేదీలోపు వెబ్‌సైట్‌లో పంపించాల్సి ఉంటుంది.
చదవండి: SCERT: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
అంశాలు ఇవే..
ఈ ఏడాది సెమినార్‌కు సైన్స్ విద్య, రైజింగ్ భారత్‌ను ప్రధానాంశాలుగా నిర్ణయించారు. పాఠశాల విద్యలో స్టెమ్ ప్రభావం, అభివృద్ధి, సైన్స్ బోధనలో సృజనాత్మకత, పర్యావరణ చైతన్యంలో జీవవైవిధ్యం, పర్యావరణ విద్యను ప్రోత్సహించడం, పాఠశాలలను ఆవిష్కరణల కేంద్రంగా మార్చడం అనే ఉప అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
అర్హులు వీరే..
ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయ శిక్షణార్థులు, సైన్స్ విద్యకు సంబంధం ఉన్న ఎన్జీవోలు, పరిశోధకులు ఈ పత్రాలను సమర్పించాలి. పరిశోధన పత్రాల రైటప్‌లను ఇంగ్లిష్‌లో లేదా తెలుగులో ఫిబ్రవరి 2వ తేదీ వరకు పంపాలి. పూర్తి వివరాలకు టీఎస్ ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
చదవండి: Suvarna Vinayak: విద్యాభివృద్ధిలో తొలిమెట్టు, ఉన్నతి కీలకం
పరిశోధన పత్రాలు సమర్పించాలి
సైన్స్ బోధించే ఉపాధ్యాయుల మేధస్సుకు పదును పెట్టేందుకు ఈ సెమినార్ మంచి అవకాశం. నూతన ఆవిష్కరణలు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన పరిశోధనలతో సైన్స్ విద్యను పటిష్టం చేసేందుకు సైన్స్ ఉపాధ్యాయులు పరిశోధన పత్రాలు సమర్పించాలి. విద్యార్థులకు మెరుగైన బోధన చేయడానికి ఉపయోగపడుతుంది.సైన్స్ టీచర్స్ మంచి పరిశోధన పత్రాలను సమర్పించి ప్రతిభచాటాలి.
– డి.వాసంతి, డీఈఓ వరంగల్