SCERT: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి, విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేయడానికి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను ఆధ్వర్యంలో రూపొందించిన పదో తరగతి స్టడీ మెటీరియల్(మోడల్ పేపర్స్)ను డిసెంబర్ 2న ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు.
చదవండి: SCERT: విద్యా ప్రమాణాల పరిశీలనే లక్ష్యంగా..
నగరంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ డెమోక్రటిక్ పీఆర్‌టీయూ, ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏటా దాతల సహకారంతో రూపొందించి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
ఎంఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం. డెమొక్రటిక్ పీఆర్టీయూ నాయకులు జీవీఎస్ పెరుమాళ్ళు, మర్రి ప్రభాకర్, ఈ వెంకట్‌రెడ్డి, ఎంవీఎస్ నాగేంద్ర, శిరీష నాగిని, జోజయ్య, పి.సుబ్రహ్మణ్యం, కుమార్ రాజా, ఇర్ఫాన్ పాషా, అన్నపూర్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.