Skip to main content

SCERT: విద్యా ప్రమాణాల పరిశీలనే లక్ష్యంగా..

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు, భాష, గణిత, చిత్రలేఖన తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(సీస్‌)ను జిల్లాలో నిర్వహించనున్నారు.
SCERT
విద్యా ప్రమాణాల పరిశీలనే లక్ష్యంగా..

ఈ సర్వేను జిల్లా వ్యాప్తంగా నవంబర్‌ 3న నిర్వహించనున్నారు. ఇందుకోసం లోకల్‌బాడీ, ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, యూఆర్‌ఎస్‌, గురుకులాలు, నవోద య, కేంద్రీయ, ప్రైవేట్‌కు సంబంధించిన 782 విద్యాలయాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో పరిధిలోని ఫౌండేషన్‌ లెవల్‌ (3వ తరగతి), ప్రిపరేటరీ లెవల్‌ (6వ తరగతి), సెకండరీ లెవల్‌ (9వ తరగతి) దాదాపుగా 19,500 మంది విద్యార్థులకు సంబంధించిన విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు నాలుగు ప్రాక్టీస్‌ పరీక్షలు నిర్వహించారు.

మరో రెండు ప్రాక్టీస్‌ పరీక్షలను ఈనెల 31, నవంబర్‌ 2న నిర్వహించనున్నారు. పరీక్ష పేపర్‌లను ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఫైనల్‌ పరీక్షను నవంబర్‌ 3న నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థుల నైపుణ్యాల ఆధారంగా సర్వేను పూర్తి చేయనున్నారు. అందుకుగాను 861 మంది క్షేత్ర పరిశీలకులను విద్యాశాఖ సిద్ధం చేసింది.

చదవండి: AP Govt Schools: భాషా పాఠాలకూ 'డిజిటల్‌' రూపం

మెయిన్‌ పరీక్ష..

3వ, 6వ తరగతి విద్యార్థులకు భాషకు సంబంధించి 20, గణితంకు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా 9వ తరగతి విద్యార్థులకు భాషకు సంబంధించి 30 ప్రశ్నలు, గణితంకు సంబంధించి 30 ప్రశ్నలు అడుగనున్నారు. ఈ పరీక్షను సంబంధిత ఉపాధ్యాయులు కాకుండా ఎన్‌సీఈఆర్టీకి సంబంధించిన నిపుణులు నిర్వహించనున్నా రు.

ఫలితాలను ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. వీటి ఆధారంగా వెనుకబడిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా, వినూత్న మార్పులు చేస్తూ ఉపాధ్యాయులు బోధించనున్నారు. విద్యార్థులతోపాటు సంబంధింత సబ్జె క్ట్‌ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పరిపాలన అంశాలకు సంబంధించి పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ర్యాంక్‌ కేటాయించబడుతుంది.

మెయిన్‌కు సిద్ధం చేస్తున్నాం

స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సీస్‌) విద్యార్థులకు లబ్ధి చేకూర్చ నుంది. జిల్లాలో ఈ సర్వేలో భాగంగా నాలుగు పరీక్షలు నిర్వహించాం. మరో రెండు పరీక్షలు పూర్తి చేసి, నవంబర్‌ 3న నిర్వహించే మెయిన్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాం. అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఈ సర్వేతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు తెలుసుకునే అవకాశాం లభిస్తుంది.
–భాస్కర్‌, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

Published date : 30 Oct 2023 03:24PM

Photo Stories