Skip to main content

India and Africa: భారత్, ఆఫ్రికా మధ్య పరస్పర సహకారం మరింతగా పెరగాలి

భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆకాంక్షించారు.
19th CII India Africa Business Conclave Programme

ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్‌ ప్రిఫరెన్స్‌ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్‌కడ్‌ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్‌ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. 

ఇండియా–ఆఫ్రికా బిజినెస్‌ సదస్సు..
సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్‌కడ్‌ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై భారత్‌ 12.37 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్‌ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్‌కడ్‌ చెప్పారు.

Strategic Partnership: భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. ఎనిమిది ఒప్పందాలపై..

Published date : 24 Aug 2024 02:20PM

Photo Stories