Skip to main content

Suvarna Vinayak: విద్యాభివృద్ధిలో తొలిమెట్టు, ఉన్నతి కీలకం

ఖమ్మం సహకారనగర్‌: విద్యార్థుల అభివృద్ధిలో తొలిమెట్టు, ఉన్నతి కీలకపాత్ర పోషిస్తాయని ఎస్‌సీఈఆర్‌టీ కోఆర్డినేటర్‌ సువర్ణ వినాయక్‌ తెలిపారు.
first step in the development of education, SCERTCoordinator, SCERTCoordinator,

తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల అమలును సువర్ణ వినాయక్‌ బృందం న‌వంబ‌ర్‌ 16న‌ జిల్లాలోని పలు పాఠశాలల్లో పర్యవేక్షించింది.

చదవండి: Devasena: 18న టీచర్లు, పేరెంట్స్‌ సమావేశం

అనంతరం ఖమ్మంలోని జెడ్పీ హాల్‌లో రిసోర్స్‌ పర్సన్లు, జిల్లాస్థాయి అధికారులతో సమావేశం కాగా, సువర్ణ వినాయక్‌ మాట్లాడుతూ.. నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ, ఉపాధ్యాయులకు ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని సూచించారు. డీఈఓ సోమశేఖర శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్‌సీఆర్‌టీ ప్రొఫెసర్‌ రవికాంత, డైట్‌ ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణతో పాటు సురేశ్‌, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Published date : 17 Nov 2023 01:01PM

Photo Stories