Vande Bharat Sleeper Train: పట్టాలపైకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలు.. ఎప్పుడంటే..
దీంతో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.
2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్‌లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్‌లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.
వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ప్లాంట్ నుంచి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్‌లో హైస్పీడ్ రైలు ట్రయల్‌ను నిర్వహించనున్నారు.
Union Cabinet: రెండు విమానాశ్రయాలు, మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
స్లీపర్ వందేభారత్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్‌లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్‌ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్‌కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి.