Skip to main content

Rajesh Nambiar: నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా రాజేశ్‌ నంబియార్

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) నూతన ప్రెసిడెంట్‌గా కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ నియమితులయ్యారు.
Rajesh Nambiar appointed as Nasscom President

దేబ్జానీ ఘోష్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత నవంబర్‌ 2024లో నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా నంబియార్‌ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడైన ఆయన 2023లో నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీసీఎస్, ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, రాజేశ్‌ నంబియార్‌ కాగ్నిజెంట్‌ సీఎండీ పదవికి రాజీనామా చేశారు. గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్, ఇండియా సీఎండీగా రాజేశ్‌ వారియర్‌ను ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ నియమించుకుంది.

సెప్టెంబర్‌ 2 నుంచి గ్లోబల్‌ హెడ్‌గా, అక్టోబర్‌ 1 నుంచి సీఎండీగా బాధ్యతలు అందుకుంటారు. కాగ్నిజెంట్‌లో చేరక ముందు హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌ అమెరికాస్‌ ఈవీపీగా వారియర్‌ పనిచేశారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్, యాక్టివ్‌క్యూబ్స్‌ వంటి సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు.

New Chief Secretary: అరుదైన రికార్డు.. భర్త తర్వాత భార్య ప్రధాన కార్యదర్శులుగా..

Published date : 23 Aug 2024 06:24PM

Photo Stories