Skip to main content

National Science Day: సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ప్రతిభ

ఖానాపూర్‌: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఎఫ్‌పీఎస్‌టీ, టీబీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 20న‌ ఆన్‌లైన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ఖానాపూర్‌ విద్యార్థిని ప్రతిభ కనబర్చింది.
Aptitude in Science Talent Test

పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన దాసరి పల్లవి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచినట్లు హెచ్‌ఎం సంధ్యారాణి, గైడ్‌ టీచర్‌ సుస్మారాణి, స్రవంతి తెలిపారు.

చదవండి: Inspire Manak: బాలల మేథస్సు భళా.. 79 ప్రాజెక్ట్‌లు ఎంపిక

జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుదని ఉపాధ్యాయులు తెలిపారు.

Published date : 22 Feb 2024 03:58PM

Photo Stories