Skip to main content

Prof Abhay Karandikar: స్టార్టప్‌లకు ప్రోత్సాహం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు సహకారం అందిస్తుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ అభయ్‌ కరందికర్‌ పేర్కొన్నారు.
Indian Union Science and Technology Department    Encouragement for startups   Government officials discussing science and technology initiatives.

 హైదరాబాద్‌ ఐఐటీ 16వ వ్యవస్థాపక దినోత్సవం మార్చి 21న‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా పాల్గొన్న అభయ్‌ ‘సాతి’లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష రంగంతో పాటు, వైద్య రంగంలో దేశం ఎన్నో విజయాలను సాధించిందని అన్నారు.

చదవండి: Krishna Ella: మానవ వనరుల అభివృద్ధిలో భారత్‌ నం.1

కంప్యూటరింగ్‌, కమ్యూనికేషన్స్‌, క్వాంటం సెన్సింగ్‌, మెట్రాలాజీ, క్వాంటం మెటీరియల్స్‌–డివైజ్‌ తదితర వాటిల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు తమశాఖ ద్వారా బీజాలు వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ పాలకమండల చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీ.ఎస్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 23 Mar 2024 11:39AM

Photo Stories