Inspire Manak: బాలల మేథస్సు భళా.. 79 ప్రాజెక్ట్‌లు ఎంపిక
Sakshi Education
జగిత్యాల: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.
వినూత్న ఆలోచనలతో నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ మానక్‌లో భాగంగా పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు ఎంపికయ్యారు.
చదవండి: INSPIRE-MANAK: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
జగిత్యాల జిల్లాలో 218 పాఠశాలల నుంచి 530 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 79 ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. జిల్లా స్థాయిలో ఇంటర్నల్ జ్యూరీ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఐదుగురు విద్యార్థులు తయారుచేసిన ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వీరు నెలాఖరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
Published date : 22 Feb 2024 04:29PM