National Science Day: ట్రిపుల్ ఐటీలో జాతీయ సైన్స్ దినోత్సవం
Sakshi Education
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్టూడెంట్ డెవలప్‌మెంట్ అండ్ క్యాంపస్ యాక్టివిటీ సెల్ ఆధ్వర్యంలో పీయూసీ విద్యార్థులకు ఎక్స్‌పో ఈవెంట్‌ను నిర్వహించింది. సృజనాత్మకమైన ఆవిష్కరణలే లక్ష్యంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. పీయూసీకు చెందిన 20 మంది విద్యార్థులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇంజినీరింగ్, పర్యావరణ శాస్త్రం వంటి వివిధ విభాగాలలో విస్తృతమైన సైన్స్ ప్రాజెక్ట్‌లు, ప్రయోగాలు, ఆవిష్కరణలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ ఆచార్య ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి కనబరిచి నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. అనంతరం విజేతలకు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌డీసీఏసీ ఇన్‌చార్జ్ వి.రాము పాల్గొన్నారు.
Published date : 01 Mar 2024 11:55AM