Skip to main content

Jobs: ‘టీవీఎస్‌’లో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు తక్షణ ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.
Jobs
‘టీవీఎస్‌’లో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

ఇప్పటికే పలు సంస్థల్లో పాలిటెక్నిక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. తాజాగా గుంటూరులోని మద్ది బాలత్రిపుర సందరమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో టీవీఎస్‌ గ్రూప్‌ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో 116 మంది ఎంపికయ్యారని తెలిపారు.

చదవండి: GT Course: మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జీటీ కోర్సు

మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించగా, మార్చి 17న వారందరికీ నియామక లేఖలు అందించామని పేర్కొన్నారు. వీల్స్‌ ఇండియా సంస్థ ఎంపిక ప్రక్రియను చేపట్టగా, వీరందరికీ ప్రారంభంలో రూ.2.4 లక్షల వార్షిక వేతనం ఇస్తారని, ఇతర సదుపాయాలు కల్పిస్తారని నాగరాణి వివరించారు.

చదవండి: పాలిటెక్నిక్‌ చేసినా.. ఇంటర్‌లో చేరొచ్చు

క్రీడల్లోనూ ప్రతిభ 

హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఇటీవల జరిగిన 4వ అఖిల భారత దక్షిణ ప్రాంత పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్, గేమ్స్‌ మీట్‌లో ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని నాగరాణి తెలిపారు. షాట్‌ఫుట్, హైజంప్, లాంగ్‌ జంప్, ట్రిపుల్‌ జంప్, డిస్కస్‌ త్రో, వాలీబాల్, చెస్, టేబుల్‌ టెన్నిస్, 100, 200, 300, 400 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో రాష్ట్రానికి చెందిన 40మంది బాలికలు, 52మంది బాలురు పతకాలు సాధించారని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

చదవండి: పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు ఏఐసీటీఈ వేతనాలు

Published date : 18 Mar 2023 05:12PM

Photo Stories