పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఏఐసీటీఈ వేతనాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వేతనాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
దానికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన జీవో జారీ చేసేందుకు ఫైలును ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఒకట్రెండురోజుల్లో ఈమేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలోని 2 వేల మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరనుంది.
Published date : 12 Jun 2021 01:59PM