వెద్యశాఖ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో పోస్టులు ఖాళీగా ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జూలై 15న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో ఎటువంటి జాప్యం లేకుండా ఎప్పుడు ఏ పోస్టు ఖాళీ అయినా వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏ స్థాయిలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరతనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిచ్చింది. దీనివల్ల వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పోస్టులు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ప్రభుత్వానికి ఫైలు పంపకుండానే వెంటనే భర్తీ చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి వరకు హెల్త్ కేర్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16,000 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో సీఎస్ వివరించారు.
చదవండి: