Skip to main content

Mega Job Mela: ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్‌మేళా

కంచరపాలెం (విశాఖ): స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఆగ‌స్టు 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయీమెంట్‌ అధికారులు సీహెచ్‌ సుబ్బిరెడ్డి (క్లరికల్‌), కె.శాంతి (టెక్నికల్‌) తెలిపారు.
Mega Job Mela
ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్‌మేళా

రక్షిత డ్రగ్స్‌, ఏడీఎల్‌ ఆగ్రో ఫార్మా, ఆటోమోటివ్‌ మ్యానుఫ్యాక్చర్స్‌, రక్షిత్‌ ఫార్మాసూటికల్‌, టీం లీజ్‌ యూనియన్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో 282 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ప్రొడక్షన్‌ ఆపరేటర్‌, కెమిస్ట్‌, ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌ కెమిస్ట్‌, ఫిట్టర్స్‌, కస్టమర్‌, అండ్‌ ఫీల్డ్‌ ట్రైనీ, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఫార్మాసిస్ట్‌, అకౌంటెంట్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, హార్టీకల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, మెకానిక్స్‌, టెలికాలర్స్‌, టీం లీడర్స్‌, అసిస్టెంట్‌ సేల్స్‌ మేనేజర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌, ఎంబీఏల్లో ఉత్తీర్ణత సాధించి 18–35 ఏళ్లు కల్గిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాల బట్టి జీతం నెలకు రూ.12 వేలనుంచి రూ.25 వేల వరకు ఉంటుందన్నారు. అభ్యర్ధులు ncs.gov.in వెబైసెట్‌లో తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు.

చదవండి:

India Post GDS 2023: ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే 30,041 పోస్టులు.. ఉద్యోగాల వివరాలు, ఎంపిక విధానం..

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 23 Aug 2023 01:21PM

Photo Stories