Skip to main content

MANUU: దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
MANUU
దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉర్దూ యూనివర్సిటీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (డీడీఈ) డ్యూయల్‌ మోడ్‌ విశ్వవిద్యాలయం డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలను అందిస్తోంది. ఈ కోర్సులను డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (యూజీసీ) గుర్తించింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి చివరితేదీ అక్టోబర్‌ 20గా, అడ్మిషన్‌ ఫీజు చెల్లించడానికి చివరితేదీ అక్టోబర్‌ 31గా నిర్ణయించారు. ఈ–ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాలను manuu.edu.in/dde వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 4252050లో సంప్రదించవచ్చు. అలాగే, ప్రాంతీయ కేంద్రాలు/ఉప ప్రాంతీయ కేంద్రాల్లోనూ వివరాలు పొందవచ్చు.

చదవండి: 

Published date : 02 Aug 2022 04:03PM

Photo Stories