Skip to main content

Jagananna Videshi Vidya Deevena: మీరు చదవండి..మేం చదివిస్తాం!

తిరుపతి అర్బన్‌: ‘తలరాత మార్చేది చదువు ఒక్కటే. ప్రతి ఇంట్లో గొప్పగొప్ప ఇంజినీర్లు.. డాక్టర్లు రావాలి. అందుకు ఎంత ఖర్చైనా ఫర్లేదు. మీరు చదవండి..మేం చదివిస్తాం’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభల్లో చెబుతుంటారని.. ఆ మాటలు నిజం చేస్తూ విద్యకు పెద్దపీట వేశారని’ కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి తెలిపారు.
మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి
మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ తాడేపల్లి నుంచి గురువారం ప్రారంభించగా.. అదే సమయంలో తిరుపతి కలెక్టరేట్‌ నుంచి లబ్ధిదారులతోపాటు వారి తల్లిదండ్రులు, అధికారులు ఆ కార్యక్రమాన్ని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ లబ్ధిదారులకు రూ.2.31 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. 

Also read: Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి 357 మంది విద్యార్థులు ఎంపికవగా.. వారి ఖాతాల్లోకి రూ.45.53 కోట్లను జమచేశారని చెప్పారు. జిల్లాలో తొలి దశలో 15 మంది విద్యార్థులకు రూ.2.31కోట్లు జమచేసినట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించే దిశలో జగనన్న విదేశీ విద్యాదీవెన అమలు చేస్తున్నారని చెప్పారు. జిల్లా సాంఘిక సంక్షేమ,సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Also read: Jagananna Videshi Vidya Deevena: విద్యాదీవెన పథకానికి అర్హత.. ధన్యవాదాలు తెలిపిన సాయికిరణ్‌

అట్టహాసంగా జగనన్న విదేశీ విద్యాదీవెన జిల్లాలో 15 మందికి రూ. 2.31కోట్ల జమ

వెళ్లలేననుకున్నా

నా పేరు జవహర్‌రెడ్డి. మాది తిరుపతి. నేను ఎమ్మెస్సీ ఇన్‌ ఫైనాన్స్‌ టెక్నాలజీ అండ్‌ పాలసీ చదవడానికి యూకే వెళ్లాలనుకున్నాను. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కావడంతో నాకు రూ.38 లక్షలు మంజూరయ్యాయి.

Also read: Teacher Education System: మా‘స్టార్లు’గా మార్చేందుకు..

నాకు రూ.53 లక్షల మంజూరు

నా పేరు దర్శిత చౌదరి. మాది తిరుపతి. నేను అమెరికాలోని నూయార్క్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ సీట్‌ సంపాదించాను. జగనన్న విదేశీ విద్యా దీవెన గురించి తెలిసి...దరఖాస్తు చేసుకున్నా. ట్యూషన్‌ ఫీజు కింద రూ.53 లక్షలు మంజూరు చేశారు. జగనన్నకు ధన్యవాదాలు

Published date : 28 Jul 2023 04:13PM

Photo Stories