Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో మొదటి, రెండో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యా లయం నుంచి గురువారం జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు కలెక్టర్ రాజాబాబు ఆర్థిక సాయం చెక్కు అందజేశారు. జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 19 మంది విద్యార్థులకు రెండోవిడత రూ.2,29,65,000, పది మందికి మొదటి విడతగా రూ.1,68,42,000 చొప్పున రూ.3.98 కోట్ల సాయం అందిందని తెలిపారు.
Also read: Scholarships: విదేశీ విద్యాదీవెనకు 357 మంది ఎంపిక
ఉన్నత విద్య కోసం విదేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవగలిగే ప్రతిభ ఉండి, పేదరికం కారణంగా చదువుకోలేని విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద నాలుగు విడతల్లో ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంయూడీఏ చైర్‌పర్సన్ బొర్రా నాగలక్ష్మీదుర్గాభవాని, సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- కృష్ణా జిల్లాలో 29 మంది
- విద్యార్థులకు రూ.3.98 కోట్లు
- లబ్ధిదారులకు చెక్కు అందజేసిన
- కలెక్టర్, ప్రజాప్రతినిధులు
Also read: Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యకు ఊతం @ 100% fee reimbursement