నాంపల్లి (హైదరాబాద్): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2023 విద్యా సంవత్సరానికి వివిధ రకాల ప్రోగ్రాములైన సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములో చేరడానికి ప్రవేశ గడువు పొడిగించినట్లు ఇగ్నో హైదరా బాదు ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ కె.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇగ్నో ప్రవేశాల గడువు పొడిగింపు
జూలై 15వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో ఇగ్నో వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థు లు ఇగ్నో వెబ్‌సైట్ 9492451812, 040– 23117550 ఫోన్‌లో సంప్రదించాలని కోరారు.