Skip to main content

IGNOU: కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సును ప్రారంభించింది.
IGNOU
కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

ఈ కోర్సును AICTE ఆమోదించింది. అర్హులైన అభ్యర్థులు జూలై సెషన్ కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ http://ignou.ac.in/లో అడ్మిషన్‌ తీసుకోవచ్చు. ఇగ్నో ప్రత్యేకంగా MBA కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిశ్రమ-విద్యా అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును పొందించారు. 50 శాతం మార్కులు ఉన్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు, 45 శాతం మార్కులు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులో ప్రవేశం కోసం యూనివర్సిటీ ద్వారా ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. MBA కోర్సు ఐదు స్పెషలైజేషన్‌లను అందిస్తుంది. మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, సేవా నిర్వహణ, ఫైనాన్స్‌ నిర్వహణ ఉన్నాయి. ప్రోగ్రామ్ కనీస వ్యవధి 2 సంవత్సరాలు గరిష్టంగా 4 సంవత్సరాలు ఉంటుంది. కోర్సు కోసం దరఖాస్తు చేయడానికి  సెప్టెంబర్ 30, 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: 

BRAOU: MBA HHCM Entrance Test Rank List 2021

NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ?

Published date : 18 Sep 2021 03:21PM

Photo Stories