Skip to main content

4th Class Admissions: స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపిక తేదీ విడుద‌ల‌

వనపర్తి టౌన్‌: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌లో 4వ తరగతి ప్రవేశానికి గాను జూన్ 28న విద్యార్థుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సుదీర్‌కుమార్‌ రెడ్డి జూన్ 19న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Admission options in Sports School

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. 4వ తరగతిలో ప్రవేశానికి హాజరయ్యే విద్యార్థులు 2015 సెప్టెంబర్‌ 1నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

విద్యార్థుల ఎత్తు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 30 మీటర్ల ఫ్లైయింగ్‌ స్టార్ట్‌, 800 మీటర్ల పరుగు పోటీ, బరువు, వర్టికల్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌త్రో, 6 – 10 మీటర్ల షటిల్‌ రన్‌ పోటీలు నిర్వహించి, అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ 98858 51813 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Published date : 20 Jun 2024 03:36PM

Photo Stories