NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ?
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ ఐఐటీ–మద్రాస్ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి.
యూనివర్సిటీల్లో ఐఐఎస్‌సీ–బెంగళూరు...
యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు(ఐఐఎస్‌సీ–బెంగళూరు) తొలిస్థానంలో నిలవగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానం దక్కించుకుంది. వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానం సాధించింది. ఇక న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానం పొందింది. ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ?
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఐఐటీ–మద్రాస్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...