Skip to main content

Anwesha Reddy IAS Success Story : అమ్మ మాటను నిల‌బెట్టా.. అనుకున్న‌ది సాధించి క‌లెక్ట‌ర్ అయ్యానిలా..

లక్షల జీతాన్ని కాదని.. ల‌క్ష్యం కోసం.. సివిల్స్ వైపు అడుగులు వేసింది. అనుకున్న‌ట్టే.. యూపీఎస్సీ సివిల్‌ 2016 ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో 80వ ర్యాంక్ సాధించారు. ఈ నేప‌థ్యంలో ఈ యువ ఐఏఎస్ అధికారి అన్వేషా రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..
Anvesha Reddy, IAS
Anvesha Reddy, IAS

కుటుంబ నేప‌థ్యం :

Anvesha Reddy IAS Family


వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని అన్నారం అన్వేషా రెడ్డి స్వగ్రామం.
త‌ల్లి సుగుణమ్మ. తండ్రి యుగంధర్‌ రెడ్డి.ఇద్ద‌రూ.. ఉపాధ్యాయులే. త‌మ్ముడు అకిల్ రెడ్డి. రాజ‌స్థాన్‌లోని బిట్స్ ఫిలానీలో బీటెక్ పూర్తి చేశాడు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

ఎడ్యుకేష‌న్‌:
పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లో చ‌దివింది. ప‌దో త‌ర‌గ‌తి టాప‌ర్‌గా ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ మాత్రం ఐఐటీ రామయ్య అకాడమీలో చదివారు. జార్ఖండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు.

Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

లక్షల జీతాన్ని కాదని.. ల‌క్ష్యం కోసం..
కొంతకాలం టాటా స్టీల్స్‌లో ఉద్యోగం చేసింది. లక్షల జీతాన్ని కాదనుకొని.. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసుల వైపు అడుగులు వేసింది. మొదటి ప్రయత్నంలోనే 2015లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లింది. మొద‌టి ప్ర‌య‌త్నంలో నేను చేసిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకొని.. రెండో ప్రయత్నంలో   విజేతగా నిలిచింది. రోజుకు 18 గంట‌లు చ‌దివి.. అనుకున్న ల‌క్ష్యం సాధించారు. ల‌క్ష్యం సాధించే వ‌ర‌కు రెండు సంవ‌త్స‌రాలు ఇంటికి కూడా రాలేదు అన్వేషా రెడ్డి.

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

సివిల్స్ వైపు ఎందుకు వ‌చ్చారంటే..?
ఇంట‌ర్ చ‌దివే రోజుల్లోనే ఐఏఎస్‌ను లక్ష్యంగా పెట్టుకుంది అన్వేష. ధన్‌బాద్‌లో చదువుతున్నప్పుడు.. ఐపీఎస్‌ అధికారి అంబరీశ్‌ మిశ్రా సారథ్యంలో నడుస్తున్న కర్తవ్య అనే ఎన్జీవోలో కొద్దికాలం వలంటీర్‌గా పనిచేసింది. మిశ్రా ఆలోచనలు ఆమెను అపారంగా ప్రభావితం చేశాయి. నలుగురి కోసం పనిచేయాలని అనుకునేవారికి ఐఏఎస్‌ను మించిన కెరీర్‌ లేదని అర్థమైపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్‌ సమరశంఖం పూరించింది.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

అమ్మ‌కు ఇచ్చిన మాటను..
పిల్లల ఆశయాలు పిల్లలవి, కన్నవారి కలలు కన్నవారివి. ఆ దశలోనే, పెండ్లి చేసుకోమంటూ తల్లివైపు నుంచి కొంత ఒత్తిడి వచ్చింది. సివిల్స్‌ నా లక్ష్యం. అనుకున్నది సాధించేందుకు కొంత సమయం ఇవ్వండి అంటూ అమ్మానాన్నలను ఒప్పించింది. ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

నేను పాలమూరు బిడ్డనే.. 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే నాకు సివిల్స్‌లో ర్యాంకు వచ్చింది. కాబట్టి.., తెలంగాణ నుంచి ఎంపికైన ఐఏఎస్‌ అధికారినని గర్వంగా చెప్పగలను. నేను పాలమూరు బిడ్డను. ఇక్కడ ప్రజల కష్టాలు, కరువులు చూస్తూ పెరిగాను. 

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే.. 

నా విజ‌యంలో కీల‌క పాత్ర వీరిదే..
పట్టుదలతో పాటు ప్రోత్సాహం.. ఉంటే ఏ రంగంలోనైనా అగ్రస్థానం సాధ్యమే. సివిల్‌ సర్వెంట్‌గా ప్రజలకు సేవ చేయాలన్న బలమైన సంకల్పం అవరోధాలను అధిగమించే శక్తిని ఇస్తుంది. ఐఏఎస్‌ కోసం నేను రెండేళ్లు కష్టపడి చదివాను. సివిల్స్ కోసం ఢిల్లీలో శిక్ష‌ణ తీసుకున్నాను చదువుకునే సమయంలో అమ్మానాన్న ప్రోత్సాహం.., సర్వీస్‌లోకి వచ్చాక భర్త సహకారం మరువలేనిది. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేకుండా చదివిస్తున్నారు. కష్టపడి కలలు నెరవేర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఏ గణాంకాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. లక్ష్యంపైనే గురిపెడితే ఏదైనా సాధించవచ్చు.. అది సివిల్స్‌ కావచ్చు.., గ్రూప్స్‌ కావచ్చు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Published date : 14 Jul 2022 04:24PM

Photo Stories