Skip to main content

Success Story: ఎలాంటి కోచించి లేకుండానే.. సివిల్స్‌లో 74వ‌ ర్యాంక్ కొట్టానిలా..

డిగ్రీ పూరైన‌ వెంటనే యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో సత్తా చాటాడు లాల్ ఆయుష్ వెంకట్ వాట్స్.
upsc civils ranker success story
Lal Ayush Venkat Vats, UPSC Civils 74th Ranker

నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా మారారు. అంకిత భావం, స‌రైన ప్ర‌ణాళిక‌ ఉంటే సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు ఆయుష్. లాల్ ఆయుష్ విజ‌య ర‌హ‌స్యం తెలుసుకుందామా..!

Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

కుటుంబ నేప‌థ్యం :
ఆయుష్ తండ్రి తరుణ్ కుమార్ రిటైర్డ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ప్రస్తుతం బేలాడ్ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లి నిషా సింగ్ కటోరియా. బంకాలోని ప్రాజెక్ట్ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆయుష్‌ ఇద్దరు సిస్టర్స్ డాక్టర్లు కావడం విశేషం.

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

ఫస్ట్ అటెమ్ట్‌లోనే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే..
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మామూలు విషయం కాదు. అందుకే చాలామంది అభ్యర్థులు తమ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంటారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ లో విజయం సాధించే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. పట్టు విడవకుండా ఏళ్ల తరబడి ప్రిపేరయితేనే ఈ ఎగ్జామ్స్‌లో పాస్ కావడం సాధ్యమవుతుంది. అయితే బిహార్ యువకుడు మాత్రం ఫస్ట్ అటెమ్ట్‌లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 74తో మెరిశాడు. అది కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే. 

Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

ఎడ్యుకేష‌న్ :
తన 10వ తరగతిని 2015లో డియోఘర్‌లో పూర్తి చేశాడు. సెంట్రల్ అకాడమీ కోట రాజస్థాన్‌లో 2017లో 12వ తరగతి పరీక్షలో పాసయ్యాడు. 2021లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ చేశాడు. 

నా ప్రిపరేషన్ మొత్తం ఇలా..
డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగంలో చేరారు..,  కానీ అందులో సంతృప్తి లభించకపోవడంతో యూపీఎస్సీ ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ఇందులో ఉత్తీర్ణత సాధించేందుకు రోజుకి పదహారు గంటలపాటు చదివాడు. ఈ పరీక్షకు ప్రిపేర్ కావాలని తనను తన తండ్రి ప్రోత్సహించారని ఆయుష్ తెలిపాడు. ప్రిపరేషన్ నిమిత్తం ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్‌ని సేకరించారు. ఆ మెటీరియల్‌ని క్షుణ్ణంగా చదివి, నోట్స్‌ను చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాడు. అలానే యూట్యూబ్‌లో ఐఏఎస్ కుమార్ అనురాగ్ లెసన్స్ ఫాలో అయ్యాడు. నోట్స్‌ను రివిజన్ చేయడం, రీ-రివిజన్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసే ముందు ప్రాథమిక అంశాలు నేర్చుకోవడం వల్ల పరీక్షలో చాలా హెల్ప్ అయిందని ఆయుష్ చెప్పుకొచ్చాడు. ఇలా సొంత ప్రణాళికతోనే సివిల్స్‌లో విజయం సాధించాడు. అంతేకాదు, ఏకంగా వంద‌ లోపు ర్యాంకు సాధించి సత్తా చాటాడు.

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే.. 

Published date : 04 Jul 2022 06:05PM

Photo Stories