Skip to main content

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌–1 (2018) తుది ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ జూలై 5వ తేదీన విడుదల చేసింది. దీంతో నాలుగేళ్లుగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్‌స్టాప్ ప‌డింది.
UPSC Civils Ranker Sanjana Simha Success Story
APPSC Group-1 Ranker Sanjana Simha Success Story

ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి కమిషన్ ఎట్ట‌కేల‌కు ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో.. ఇటీవల సివిల్స్‌లో 37వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన కందుకూరుకు చెందిన‌ కోడలు సంజనా సింహ గ్రూప్‌-1 ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఈ ఫలితాల్లో సంజనా సింహ మూడో ర్యాంకు సాధించారు. ఈ నేప‌థ్యంలో ఈమె స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

కుటుంబ నేప‌థ్యం : 
హైదరాబాద్‌ వాసి అయిన సంజనా సింహ కందుకూరుకి చెందిన మన్నవ శ్రీహర్షను వివాహం చేసుకున్నారు.

నా గ్రూపు-1 ప్రిప‌రేష‌న్ ఇలా..  
సివిల్స్‌ కంటే గ్రూపు-1 సిలబస్సే ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చాప్టర్లను అదనంగా చదవాల్సి వచ్చింది. గ్రూపు-1 కానీ.. సివిల్స్‌లో కానీ మెయిన్స్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు చూసి, జవాబులు ఎలా రాయాలో ముందుగానే సన్నద్ధం అయ్యాను. ముఖ్యంగా రైటింగ్‌ స్కిల్‌ బాగుంటేనే మార్కులు ఎక్కువగా వస్తాయి. 

Virendra, Excise SI: కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

ఇంటర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే..
నా గ్రూపు-1 ఇంటర్వ్యూలో ఇన్‌కంటాక్స్‌, సోషియాలజీకి సంబంధించిన ప్రశ్నలను అడిగారు. నేను రామకృష్ణమఠంలో వాలంటీరుగా పనిచేసినందున స్వామి వివేకానంద గురించి ఏమి తెలుసు, బ్యూరోక్రసీలోకి వస్తే మీరు ప్రజలకు ఎలా సేవ చేస్తారన్న ప్రశ్నలను అడిగారు.

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

సివిల్స్‌లో 37వ ర్యాంక్ వ‌చ్చినా కూడా.. గ్రూప్‌-1కి..
ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2021 ఫ‌లితాల్లో 37వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంద‌న్నారు. 2020 సివిల్స్‌లో 207వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ ట్రైనింగ్‌ కోసం నాగ్‌పుర్‌లో ఉన్నా. ఏపీపీఎస్సీ గ్రూపు-1 తొలిసారి రాశా. డిజిటల్‌ మూల్యాంకనం ద్వారా వెల్లడైన జాబితాలో నా పేరు లేదు. సంప్రదాయ విధానంలో జరిగిన మూల్యాంకనం ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాను. సివిల్స్‌లో 37వ ర్యాంకు సాధించినప్పటికీ.. గ్రూప్‌-1లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించాలన్న పట్టుదలతోనే ఈ పరీక్షలకు హాజ‌ర‌య్యాను.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

నా భ‌ర్త వ‌ల్లే..
కలెక్టర్ ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప ఈ ఉద్యోగాన్ని సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో సివిల్స్‌లో 37వ ర్యాంకర్ సంజన సింహ వెనక తన భర్త కష్టం ఎంతో దాగి ఉంద‌న్నారు. నేను కలెక్టర్ కావడం కోసం నా భర్త కృషి ఎంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నేను ఇంత ర్యాంకు సాధించడానికి కారణం మా హస్బెండ్ హర్ష. పెళ్లి తర్వాత కూడా ఎంతో కష్టపడి చదివానని, నా చదువు కోసం మా ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని, నేను ఏమీ చేయలేదని అంతా ఆయనే చూసుకున్నారని, ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంద‌న్నారు.

Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్న‌ట్టే కొట్టా..

నా ల‌క్ష్యం ఇదే..
నా ప్రధాన ధ్యేయం రైతు ఆత్మహత్యలు రూపుమాపడం. చదువు అనేది పిల్లలకు చాలా ముఖ్యం. పేదరికం వల్ల చదువుకు దూరమైనటువంటి పిల్లలపై దృష్టి పెట్టి వారికి చదువు అందేలా చేయడం, మహిళల ఆరోగ్యంపై కూడా ఫోక‌స్‌ పెడతాన‌న్నారు. 

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల్లో మహిళలదే పైచేయి..
గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలుండడం గొప్ప విషయమని గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలేనని వివరించారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారేనన్నారు. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారని.. ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారని చెప్పారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లున్నారని వివరించారు. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారన్నారు.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

Published date : 06 Jul 2022 07:43PM

Photo Stories