IAS Officer Success Story : 22 ఏళ్లకే ఐఏఎస్.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించానిలా.. కానీ..
ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో చేరాలంటే అనుకున్నంత ఈజీ కాదు. దీని కోసం కఠర శ్రమ చేయాల్సిందే.
ఏడాదిలోపు ఒకే ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ తక్కువ మంది ఒకరు.. ప్రతిభావంతులైన విద్యార్థిని అనన్య సింగ్. ఈమె యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో.. ఏకంగా మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ కొట్టారు. ఈ నేపథ్యంలో అనన్య సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
అనన్య సింగ్.. తండ్రి former జిల్లా జడ్జ్. తల్లి అంజలి సింగ్. ఈమె Senior lecturer at IERT. అన్న Aishwarya Pratap Singh.
ఎడ్యుకేషన్ :
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనన్య సింగ్. మేరీస్ కాన్వెంట్ స్కూల్‌లో ఈమె పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10, 12 తరగతులలో CISCE లో జిల్లా టాపర్ ఈమె. అలాగే ఈమెకు పదోతరగతిలో 96%.. 12వ తరగతిలో 98.25% సాధించి టాపర్‌గా నిలిచారు. తర్వాత ఈమె ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్ ఆనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈమె చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు చదువుల్లో టాపర్‌గా ఉండేవారు.
సివిల్స్ ప్రిపరేషన్ ఇలా..
అనన్య సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఒక సంవత్సరం తర్వాత.. మొదటి ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 51వ ర్యాంక్‌ను సాధించి.. అందరి ఆశ్చర్యపరిచారు. చాలా మంది ఆమె విజయానికి గల కారణం తెలుసుకోవాలనేది చాలా మంది UPSC పరీక్ష ఆశావాదుల కోరిక.
Success Story : సొంతూరికీ వెళ్లకుండా చదివా.. అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
కేవలం 22 ఏళ్ల వయస్సులోనే..
భారతదేశం అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ సివిల్స్.. ఇది క్లియర్ చేసినప్పుడు అనన్య సింగ్ కేవలం వయస్సు 22 మాత్రమే.
➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై నడిచేలా చేశాయ్.. నా వైకల్యం కారణంగా..
ఈమె ఇష్టాలు ఇవే..
ఐఏఎస్ అధికారిణి అనన్య సింగ్.. సింథసైజర్ పరికరాన్ని బాగా వాయించారు. అలాగే ఈమెకు నిరంతరం చదవడానికి ఇష్టపడేవారు.