ENCAT 2022: కెరీర్ నిర్మాణం
ముఖ్యంగా దేశ నిర్మాణ రంగంలో స్కిల్డ్ వర్కర్స్‌తోపాటు మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కొరత నెలకొంది. నిర్మాణ రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన లాభాపేక్షలేని సంస్థ.. ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(నిక్మర్). ప్రస్తుతం నిక్మర్‌లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు..
» నిక్మర్(ఎన్‌ఐసీఎంఏఆర్)లో ప్రవేశాలు
» ఎన్‌క్యాట్–2022 నోటిఫికేషన్ విడుదల
» నిర్మాణ రంగంలో మేనేజ్‌మెంట్ కోర్సులు
దేశవ్యాప్తంగా నిక్మర్‌కు పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీల్లో నాలుగు క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ సంస్థ వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎన్‌క్యాట్(నిక్మర్ కామన్ అడ్మిషన్ టెస్ట్)కు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో విధానంలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. దేశంలోని నాలుగు నిక్మర్ క్యాంపస్‌ల్లో కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ఏడాది, రెండేళ్ల కోర్సులు కూడా ఉన్నాయి.
Creativity and Artistic Career: వినోద రంగం.. కొలువుల తరంగం!
కోర్సులు–అర్హతలు
- కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ ఏసీఎం).
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. అందిస్తున్న క్యాంపస్‌లు: పుణె, హైదరాబాద్, ఢిల్లీ, గోవా.
అర్హత: బీఈ/బీటెక్, లేదా బీఆర్క్/బీ డిజైన్‌ల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ ఈపీఎం). కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు.
అందిస్తున్న క్యాంపస్‌లు: పుణె, హైదరాబాద్.
అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్(పీజీపీ ఆర్‌ఈయూఐఎం).
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు.
అందిస్తున్న క్యాంపస్‌లు: పుణె.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్, లేదా బీఆర్క్ ఉత్తీర్ణత సాధించాలి. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెట్ అండ్ మేనేజ్‌మెంట్(పీజీపీ ఐఎఫ్‌డీఎం).
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు.
అందిస్తున్న క్యాంపస్: పుణె.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్, లేదా బీఆర్క్ ఉత్తీర్ణత సాధించాలి. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్(పీజీపీఎంఎఫ్‌ఓసీబీ).కోర్సు కాల వ్యవధి: ఏడాది
అందిస్తున్న క్యాంపస్: పుణె.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కుటుంబాలకు చెందిన వారు ఈ కోర్సులో చేరొచ్చు. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్(పీజీపీక్యూఎస్‌సీఎం).
కోర్సు కాల వ్యవధి: ఏడాది.
అందిస్తున్న క్యాంపస్: హైదరాబాద్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. - కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్, సెఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీపీహెచ్‌ఎస్‌ఈఎం).
కోర్సు కాల వ్యవధి: ఏడాది.
అందిస్తున్న క్యాంపస్: హైదరాబాద్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమాతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
MBA Special: మ్యాట్ పరీక్షకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్..
ఎంపిక విధానం
నిక్మర్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత ఎన్‌క్యాట్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులకు రెండో దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
కొలువులు
నిక్మర్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు నైపుణ్యాల ఆధారంగా అవకాశాలు అందుకోవచ్చు. ముఖ్యంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ రియాలిటీ, ఐసీఐసీఐ, రాంకీ, ఐటీసీ, పిట్రాన్ ఇంజనీరింగ్, షాపూర్‌జీ పల్లోంజీ, మెయిల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, టాటా హిటాచీ, టాటా బ్లూచిప్, సింటెల్, సినర్జీ, శాంసంగ్, ఓల్టాస్, హెచ్‌సీసీ, స్క్వేర్ యార్డ్, డీమార్ట్, దార్ గ్రూప్, ఏఐ దర్వాజీ గ్రూప్, అడార్ వెల్డింగ్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఉద్యోగ ఆఫర్లు లభిస్తున్నాయి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.12.2021
- ఆన్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్: 8, 9 జనవరి 2022
- వివరాలకు: https://nicmar.ac.in
చదవండి: Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!