MBA Special: మ్యాట్ పరీక్షకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్..
మ్యాట్.. మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్! మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష.. మ్యాట్!! దీనిని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోషియేషన్(ఏఐఎంఏ) నిర్వహిస్తోంది. ప్రతి ఏటా నాలుగుసార్లు(ఫిబ్రవరి, మే,సెప్టెంబర్, డిసెంబర్) మ్యాట్ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ప్రస్తుతం మ్యాట్ 2021 డిసెంబర్ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. మ్యాట్‌కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్..
- మ్యాట్ 2021 డిసెంబర్‌కు నోటిఫికేషన్
- పీబీటీ, సీబీటీ, డబుల్ సీబీటీ విధానాల్లో పరీక్ష
- 600 బీస్కూల్స్‌లో ఎంబీఏలో ప్రవేశం
మ్యాట్‌లో ర్యాంకు ద్వారా దేశంలోని దాదాపు 600 బీస్కూల్స్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేసుకోవడం ద్వారా కార్పొరేట్ రంగంలో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ బీస్కూల్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు)ల్లో క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్) ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
చదవండి: ఐఐఎంల్లో గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వూ.. ప్రిపరేషన్ సాగించండిలా..
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు మ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.
పరీక్ష విధానం
మ్యాట్ పరీక్ష ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో రాసుకోవచ్చు. ఇందులో మొత్తం 5విభాగాల నుంచి 200 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ప్రతీ విభాగం నుంచి 40 ప్రశ్నలు చొప్పున, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పు న కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు(150 నిమిషాలు). ఇందులో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు.
చదవండి: క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ సాధించే మార్గాలు ఇవే..
ఐదు విభాగాలు
మ్యాట్ ఐదు విభాగాలు: లాంగ్వేజ్ కాంప్రహెన్షన్–40 ప్రశ్నలు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్–40 ప్రశ్నలు, మ్యాథమెటికల్ స్కిల్స్–40 ప్రశ్నలు, డేటా అనాలిసిస్ అండ్ సఫీషియన్సీ–40 ప్రశ్నలు, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
మూడు విధాలుగా పరీక్ష
- మ్యాట్ పరీక్షను పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), రిమోట్ ప్రొక్టర్డ్ ఇంటర్నెట్–బేస్డ్ టెస్ట్(ఐబీటీ).. ఇలా మూడు విధానాల్లో రాసుకునే వెసులుబాటు ఉంది.
- పేపర్ బేస్డ్ టెస్ట్‌కు సంబంధించి ప్రశ్న పత్రం బుక్‌లెట్‌ను అందజేస్తారు. సమాధానాలు ఓఎంఆర్ షీట్‌పై గుర్తించాల్సి ఉంటుంది.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హాజరయ్యేవారు కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చిన ప్రశ్నలకు కీ బోర్డ్ లేదా మౌస్ సహాయంతో సరైన సమాధానం గుర్తించాలి.
- రిమోట్ ప్రొక్టర్డ్ ఇంటర్నెట్–బేస్డ్ టెస్ట్(ఐబీటీ) కూడా ఆన్‌లైన్ పరీక్ష లాంటిదే. దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన ప్రదేశం నుంచి పరీక్షను రాసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ సదుపాయం తప్పకుండా ఉండాలి. వీడియో, ఆడియో ఆధారంగా అభ్యర్థులను ఇన్విజిలేట్ చేస్తుంటారు.
చదవండి: జీఆర్‌ఈ, జీమ్యాట్ ప్రిపరేషన్ ఇలా సాగించండి.. విజయం సాధించండి..
సిలబస్ ఇలా
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్
- ఈ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాంటానిమ్స్–సినానిమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్/ఫ్రేజెస్, వొకాబ్యులరీ, ఫిల్ ఇన్ ద బ్లాక్స్, సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్, రీడింగ్ కాంప్రహెన్షన్ తదితరæఅంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్
- ఈ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫ్యామిలీ ట్రీ, కోర్స్ ఆఫ్ యాక్షన్, అరేంజ్‌మెంట్స్, పై చార్ట్, క్యాలెండర్స్, స్టేట్‌మెంట్స్–కన్‌క్లూజన్స్, స్ట్రాంగ్ ఆర్గ్యూమెంట్స్ అండ్ వీక్ ఆర్గ్యూమెంట్స్, పజిల్స్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, విజువల్ రీజనింగ్, సిలాజిజమ్, గ్రాఫ్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలుంటాయి.
డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ
- ఈ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. లైన్‌గ్రాఫ్,బార్‌గ్రాఫ్,పైచార్ట్,డేటా కంపారిజన్, క్వాంటిటేటివ్ కంపారిజన్, డేటా సఫిషియన్సీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటికల్ స్కిల్స్
- ఈ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, మోడర్న్ మ్యాథ్స్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
ఇండియన్ అండ్ గ్లోబల్ ఇన్విరాన్‌మెంట్
- ఈ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ఇందులో ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
చదవండి: జీఆర్‌ఈ లేక జీమ్యాట్.. ఏ పరీక్ష సులభం తెలుసుకోండిలా..
ప్రిపరేషన్ ఇలా
- మ్యాట్‌కు సన్నద్ధమయ్యే వారికి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. ప్రిపరేషన్ పరంగా ప్రణాళిక, పక్కా వ్యూహం అనుసరించాలి. టాపిక్ వైజ్‌గా షార్ట్‌నోట్స్ రాసుకోవాలి.
- ఈ పరీక్షలో అభ్యర్థులకు ఆయా వి«భాగాల్లో బేసిక్ కాన్సెప్ట్స్‌పై ఉన్న పట్టును పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
- మ్యాట్‌లో విజయానికి వేగం అనేది చాలా ముఖ్యం. అదే సమయంలో కచ్చితత్వం కూడా కీలకమే. ఇందుకోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌తోపాటు వీలైనన్నీ ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయాలి. దాంతోపాటు గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. దీని ద్వారా ఎప్పటికప్పడు పొరపాట్లను విశ్లేషించుకోవడమే కాకుండా.. సరైన ప్రిపరేషన్ వ్యూహాన్ని అనుసరించేందుకు వీలవుతుంది.
600 బీస్కూల్స్
మ్యాట్‌లో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 600కు పైగా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు మ్యాట్ అర్హులకు తర్వాతి దశలో గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ/రిటెన్ ఎబిలిటీ టెస్టులను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి.
మ్యాట్ ముఖ్య సమాచారం
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- పీబీటీ(పేపర్ బేస్డ్ టెస్ట్) దరఖాస్తు చివరి తేదీ: 30.11.2021
- అడ్మిట్ కార్డ్: 01.12.2021
- పరీక్ష తేదీ: 05.12.2021
............................................................
- సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) దరఖాస్తు చివరి తేదీ: 14.11.2021
- అడ్మిట్ కార్డ్: 16.11.2021
- సీబీటీ పరీక్ష తేదీ: 21 నవంబర్ 2021
............................................................
- డబుల్ సీబీటీ దరఖాస్తు చివరి తేదీ: 12.12.2021
- అడ్మిట్ కార్డ్: 14 డిసెంబర్ 2021
- పరీక్ష తేదీ: 19 డిసెంబర్ 2021
వెబ్‌సైట్: https://mat.aima.in
చదవండి: Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!