Skip to main content

ఐఐఎంల్లో గ్రూప్‌ డిస్కషన్స్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వూ.. ప్రిప‌రేష‌న్ సాగించండిలా..

ఐఐఎంలు మలి దశలో నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్స్‌(జీడీ)లో భాగంగా అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా ఏర్పాటుచేస్తారు. ప్రతి బృందానికి ఏదైనా ఒక టాపిక్‌ ఇచ్చి.. దానిపై మాట్లాడమంటారు.

ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ సైతం నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు నిర్దిష్ట అంశంపై తమ అభిప్రాయాలను రాయాల్సి ఉంటుంది. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి.. చివరగా పర్సనల్‌ ఇంటర్వూ్య ఉంటుంది.

ఐఐఎంలు – పీజీ సీట్లు..
క్యాట్‌లో విజయం ఆధారంగా దేశంలోని మొత్తం 20 ఐఐఎంల్లో పీజీ ప్రోగ్రామ్స్‌(ఎంబీఏ/పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌)లో చేరే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు ఎండీఐ–గుర్గావ్, ఎఫ్‌ఎంఎస్‌–ఢిల్లీ తదితర 500కు పైగా బి–స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అహ్మదాబాద్‌–395 సీట్లు; బెంగళూరు–400 సీట్లు;కోల్‌కత–460; లక్నో–500; ఇండోర్‌–450; నాగ్‌పూర్‌–130; ఉదయ్‌పూర్‌–325; త్రిచీ–240;కాశీపూర్‌–240; కోజికోడ్‌–480; బోద్‌గయ–120; రోహ్‌తక్‌–264; రాంచీ–185; సిౖర్మౌర్‌–120; అమృత్‌సర్‌–160; షిల్లాంగ్‌–92; రాయ్‌పూర్‌–90; జమ్ము–90; సంబల్‌పూర్‌–90; విశాఖపట్నం–120 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

క్యాట్‌–2021 సమాచారం..
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత).

బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్ట్‌లో ప్రారంభమయ్యే అవకాశం.
క్యాట్‌ తేదీ: నవంబర్‌ 28న జరుగుతుందని సమాచారం.
అధికారిక నోటిఫికేషన్‌: ఆగస్ట్‌లో వెలువడనుంది.

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌..
క్యాట్‌ పరీక్ష విషయంలో మార్పులు, చేర్పులు జరగడం సహజం. ఈ పరీక్షలో అడిగే సెక్షన్ల విషయంలో మాత్రం మార్పులు ఉండట్లేదు. కాబట్టి అభ్యర్థులు డీఐఎల్‌ఆర్, క్వాంటిటిటేటివ్, వెర్బల్‌ ఎబలిటీ సెక్షన్లకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించడం మేలు చేస్తుంది. బేసిక్స్, కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అదే విధంగా ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
– కనకదండి రామ్‌నాథ్, క్యాట్‌ కోర్స్‌ డైరెక్టర్, టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.

ఇంకా చ‌ద‌వండి :part 1: త్వర‌లో క్యాట్ నోటిఫికేష‌న్‌.. జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏకు అవ‌కాశం..

Published date : 07 Jun 2021 04:20PM

Photo Stories