Skip to main content

దేశవ్యాప్తంగా బీస్కూల్స్‌లో మేనేజ్‌మెంట్‌ విద్యకు ఏటీఎంఏ.. సాధిస్తే మంచి భ‌విష్యత్తుకు..

దేశవ్యాప్తంగా ఉన్న పలు బీస్కూల్స్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ఏటీఎంఏ.

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌(ఏఐఎంఎస్‌).. ఏఐఎంఎస్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌(ఏటీఎంఏ) పేరుతో ప్రతి ఏటా నాలుగుసార్లు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీనిద్వారా 700లకు పైగా బీస్కూల్స్‌లో ఎంబీఏ/పీజీడీఎం/ తదితర కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తుంది. 2021 ఏడాదికి సంబంధించి ఏటీఎంఏ నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఈ పరీక్ష గురించిన సమగ్ర సమాచారం..

అర్హతలు..
ఏటీఎంఏకు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

పరీక్ష విధానం..
కరోనా కారణంగా ఈ పరీక్షను ఏఐ,లైవ్‌ హుమాన్‌ ప్రొక్టర్డ్‌ హోమ్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో.. ఆరు సెక్షన్‌ల నుంచి 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 30 నిమిషాల చొప్పున మొత్తం పరీక్ష సమయం మూడు గంటలు. అనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌–1 నుంచి 30 ప్రశ్నలు, అనలిటిక్‌ రీజనింగ్‌ స్కిల్స్‌–2 నుంచి 30 ప్రశ్నలు, వెర్బల్‌ స్కిల్స్‌–1 నుంచి 30 ప్రశ్నలు, వెర్బల్‌ స్కిల్స్‌–2 నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌–1 నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌–2 నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు.

సిలబస్‌ ఇలా..
అనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌: ఈ సెక్షన్‌ పార్ట్‌–1,2లుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా నిర్వహిస్తారు. మొత్తం రెండు పార్ట్‌లకు కలిపి పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో రాణించేందుకు రైడల్స్, పజిల్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటిలో నంబర్‌ సిరిస్, స్టేట్‌మెంట్‌– కన్‌క్లూజన్, అనాలజీ, వెర్బల్‌ లాజిక్, కోడింగ్‌–డీకోడింగ్, సిలోజిజం, విజువల్‌ రీజనింగ్, బ్లడ్‌ రిలేషన్స్, స్ట్రైక్‌ ది ఆడ్‌ వన్‌ ఔట్, డేటా సఫీషియన్సీ, అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లెటర్స్‌ తదితర అంశాలు ఉంటాయి.

వెర్బల్‌ ఎబిలిటీ..
ఈ విభాగం రెండు పార్ట్‌లుగా ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ/యూసేజ్‌ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. జంబుల్‌ సెంటెన్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, సినానిమ్స్‌ అండ్‌ యాంటోనిమ్స్, సెంటెన్స్‌ కంప్లీషన్, గ్రామర్, వొకాబ్యులరీ అంశాలపై పట్టు సాధించాలి. గ్రామర్‌పై అవగాహన పెంచుకుంటే..పరీక్షలో మంచి ప్రతిభ కనబరచవచ్చు. ఇందుకోసం బేసిక్‌ గ్రామర్‌ బుక్స్‌తోపాటు ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌లు, ఇంగ్లిష్‌ దినపత్రికలు వంటివి చదవడం అలవాటు చేసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌..
• ఈ విభాగానికి సంబంధించి రెండు పార్ట్‌లకు కలిపి 60 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రాఫిట్, లాస్‌ అండ్‌ డిస్కౌంట్, ఇనీక్వేషన్, యావరేజెస్, ప్రాబ్లమ్స్‌ ఆన్‌ ఏజ్, సర్డ్స్‌ అండ్‌ ఇండిసిస్, యావరేజెస్, జామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ, సెట్‌ థియరీ, బైనామియల్‌ థీరమ్, క్లాంపెక్స్‌ నంబర్స్, సింపుల్‌/కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, ట్రిగ్నోమెట్రి, పర్సంటేజెస్,ఫంక్షన్స్, మెన్సురేషన్‌వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
• ప్రిపరేషన్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌ అంశాల నుంచి సమస్యల సాధనకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. షార్ట్‌కట్స్,మాక్‌ టెస్టులు, గత ప్ర‌శ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రిపరేషన్‌ టిప్స్‌..
• ప్రిపరేషన్‌ మొదలు పెట్టేముందు పరీక్ష విధానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి.
• సిలబస్‌కు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌ కోసం నోట్స్‌ తయారు చేసుకోవాలి.
• ఫార్ములాలు, షార్ట్‌ కట్‌్మను నేర్చుకోవాలి.
• వీలైనన్నీ ఎక్కువ మాక్‌ టెస్టులు, గత పరీక్షలకు సంబంధించిన పరీక్ష పత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి.
• ఏటీఎంఏకు సంబంధించి ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరించడం మేలు చేస్తుంది.
• ప్రిపరేషన్‌లో భాగంగా సులభంగా గుర్తుండే షార్ట్‌కట్స్‌ను నోట్స్‌లో రాసుకోవాలి.
• ప్రతి టాపిక్‌ నుంచి కనీసం 9–10 ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి.

ముఖ్యమైన సమాచారం..
• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.07.2021
• దరఖాస్తుకు చివరి తేదీ: 18.07.2021
• అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 21.07.2021
• పరీక్ష తేదీ: 25.07.2021
• ఫలితాల వెల్లడి: 30.07.2021
• పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://atmaaim.com

Published date : 10 Jun 2021 04:35PM

Photo Stories