Skip to main content

Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్‌ విద్య

Management Entrance Test

మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించడానికి జాతీయ స్థాయిలో ఎన్నో ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. మేటి సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యను చదవాలనుకునే వారికి క్యాట్‌ తర్వాత ఉన్న చక్కటి మార్గం.. ఎక్స్‌ఏటీ. ప్రస్తుతం 2023 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎక్స్‌ఏటీ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఎక్స్‌ఏటీ ప్రత్యేకతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..

దేశంలోని టాప్‌10 బీస్కూల్స్‌లో ఒకటి.. జంషెడ్‌పూర్‌లోని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ). ఈ విద్యా సంస్థలో ప్రవేశానికి సంబంధించి జేవియర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎక్స్‌ఏటీ) పేరుతో ప్రతిఏటా జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐతోపాటు వందకుపైగా ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏలో ప్రవేశం పొందవచ్చు.
మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరాలనుకునే వారికి జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) మంచి వేదిక. హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. ఇందులో సంబంధిత కోర్సు పూర్తిచేసుకున్న వారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు.

అర్హత
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఎక్స్‌ఏటీకి దరఖాస్తుకు చేసుకోవచ్చు. కోర్సు ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

ప్రవేశం ఇలా
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో ప్రవేశం పొందాలంటే.. ఎక్స్‌ఏటీ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితర పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం
ఎక్స్‌ఏటీ పరీక్ష రెండు సెక్షన్‌లుగా నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు. ఇందులో అభ్యర్థి ఏ సెక్షన్‌ నుంచి అయినా పరీక్ష రాసుకోవచ్చు. సెక్షన్‌ వారి నిబంధన లేదు. ఒక సెక్షన్‌లో పరీక్ష రాస్తూ కూడా మరొక సెక్షన్‌లోకి మారే వెసులుబాటు కూడా ఉంటుంది.  
సెక్షన్‌1: ఈ విభాగంలో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌26, డేసిషన్‌ మేకింగ్‌21, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి 28 చొప్పున ప్రశ్నలుంటాయి. మొత్తం 75 ప్రశ్నలుంటాయి. 165 నిమిషాల సమయం ఇస్తారు. 
సెక్షన్‌2: ఈ విభాగం నుంచి జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. ఇందులో 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 15 నిమిషాలు. 

నెగిటివ్‌ మార్కులు
ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత విధిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగానికి సంబంధించి రుణాత్మక మార్కులు లేవు. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022
  • అడ్మిట్‌ కార్డ్‌: డిసెంబర్‌ 20, 2022
  • ఎక్స్‌ఏటీ పరీక్ష తేదీ: జనవరి 08, 2023
  • వెబ్‌సైట్‌: https://xatonline.in
Published date : 18 Aug 2022 04:12PM

Photo Stories