Skip to main content

జీఆర్‌ఈ లేక జీమ్యాట్.. ఏ పరీక్ష సులభం తెలుసుకోండిలా..

క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ బాగా ఉన్న విద్యార్థులు.. చార్‌‌ట్స, టేబుల్స్, డేటా విశ్లేషించడం, డిస్క్రిప్టివ్ సమాధానాలు రాయడంలో మంచి నైపుణ్యం ఉన్నవారు జీమ్యాట్ ఎంచుకోవచ్చు.
జీఆర్‌ఈ విషయా నికి వస్తే.. ఇందులో మ్యాథమెటిక్స్ స్కిల్స్‌కు ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. గతేడాది(2019) జీఆర్‌ఈకి 5,32,000 మంది హాజరుకాగా.. జీమ్యాట్‌కు 2,25,600 మంది పోటీ పడ్డారు. ఈ రెండు పరీక్షల్లో ఏది ఎంచుకోవాలనుకుంటున్నారో అది పూర్తిగా విద్యార్థి సామర్థ్యం, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. రెండింటి సిలబస్, పరీక్ష ప్యాట్రన్‌లను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూ చిస్తున్నారు. దేశంలో ఎక్కువమంది ఇంజనీరింగ్ విద్యార్థులు జీఆర్‌ఈ/జీమ్యాట్ రెండూ రాసేందుకు ఆసక్తి చూపుతుండగా.. బీఎస్సీ హానర్స్/బీబీఏ వంటి కోర్సులు పూర్తి చేసినవారు జీమ్యాట్ వైపు మొగ్గుతున్నట్లు గత గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఇంకా చదవండి: part 3: జీఆర్‌ఈ, జీమ్యాట్ ప్రిపరేషన్ ఇలా సాగించండి.. విజయం సాధించండి..
Published date : 04 Dec 2020 03:14PM

Photo Stories