Skip to main content

Recruitment Trends 2023: స్మార్ట్‌ హైరింగ్‌.. ఐటీ కొలువు!

సాఫ్ట్‌వేర్‌ కొలువు.. ఐటీ రంగంలో కెరీర్‌.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు చదువుతున్న ప్రతి ఒక్కరి స్వప్నం! చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు అధికశాతం మంది ఐటీ జాబ్స్‌ కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి! కాని∙క్యాంపస్‌ డ్రైవ్స్‌ కేవలం ఇంజనీరింగ్‌ నేపథ్యం ఉన్న టాప్‌ కాలేజీల విద్యార్థులకే లభిస్తున్నాయనే భావన! ఇలాంటి వారు తమ సాఫ్ట్‌వేర్‌ కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం.. టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌!! దేశంలో టాప్‌–5 ఐటీ కంపెనీల జాబితాలో నిలిచిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ టీసీఎస్‌.. ఆఫ్‌ క్యాంపస్‌ పద్ధతిలో చేపడుతున్న నియామక విధానమే.. స్మార్ట్‌ హైరింగ్‌! తాజాగా స్మార్ట్‌ హైరింగ్‌–2023 ప్రక్రియను టీసీఎస్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. స్మార్ట్‌ హైరింగ్‌కు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర వివరాలు.. 
Recruitment Trends, Smart hiring 2023
Recruitment Trends, Smart hiring 2023

» ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌కు టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ టెస్ట్‌
» సైన్స్, కంప్యూటర్స్, ఒకేషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
» స్మార్ట్‌ హైరింగ్‌ ద్వారా 40 వేల మందికి కొలువులు
» ఫిబ్రవరి 10న టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ టెస్ట్‌


ఐటీ కంపెనీల్లో నాన్‌–ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ కొలువు అందని ద్రాక్షే అనే అభిప్రాయముంది. దీనికి భిన్నంగా.. సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఒకేషనల్, కంప్యూటర్స్‌/ఐటీ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ఖరారు చేసేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌..ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో చేపడుతున్న నియామక ప్రక్రియే.. టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌.

అర్హతలు

  • నిర్దేశిత గ్రూప్‌లలో 2023లో డిగ్రీ పూర్తి చేసుకోనున్న విద్యార్థుల కోసం స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియను టీసీఎస్‌లో ప్రారంభించింది. 
  • బీసీఏ, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్‌/బయో కెమిస్ట్రీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులను 2023లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొంది.
  • పదో తరగతి నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ వరకు ప్రతి స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి.
  • బ్యాచిలర్‌ డిగ్రీలో ఒక బ్యాక్‌లాగ్‌ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. 
  • అకడమిక్‌గా గ్యాప్‌ రెండేళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని కూడా పేర్కొన్నారు. 
  • దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 18–28 ఏళ్ల మధ్య ఉండాలి.

also read: LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీలో 9394 ఏడీవో పోస్టులు

‘సైన్స్‌ టు సాఫ్ట్‌వేర్‌’
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రధాన ఉద్దేశం..ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను విస్తృతం చేయడం. అదే విధంగా.. నిర్దేశిత సబ్జెక్ట్‌ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్‌వేర్‌ కొలువులు ఖరారు చేయడం. ఇందుకోసం ప్రత్యేకంగా సైన్స్‌ టు సాఫ్ట్‌వేర్‌ పేరుతో వినూత్న ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌లతో బీఎస్సీ..అదే విధంగా బీసీఏ,సీఎస్‌/ఐటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థుల కోసం స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియను చేపడుతోంది.

సమయం ఆదా
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియలో మరో ప్రధాన ఉద్దేశం.. సమయం ఆదా చేయడం. వాస్తవానికి క్యాంపస్‌ డ్రైవ్స్‌ విధానంలో నియామక ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో అటు విద్యార్థులకు, ఇటు సంస్థకు సమయం ఆదా అయ్యేలా టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియ దోహదపడుతుంది.

also read: CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం


40 వేల మంది
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటోంది. ఈ సంఖ్యను ప్రతి ఏటా సంస్థ నియామక ప్రణాళిక ఆధారంగా నిర్ధారిస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.

ఆరు నెలల శిక్షణ
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్‌ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, బిహేవియర్‌ స్కిల్స్, ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్‌ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.

also read: NDA Pune Group C Recruitment 2023: ఎన్‌డీఏ–పుణెలో 251 గ్రూప్‌ సీ పోస్టులు


మూడు దశల ఎంపిక ప్రక్రియ
టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ విధానంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష ఫిబ్రవరి 10వ తేదీన టీసీఎస్‌ ఐయాన్‌ సెంటర్లలో జరుగుతుంది.

రాత పరీక్ష.. మూడు విభాగాలు
తొలుత ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమరిక్‌ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15–20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పరీక్ష వ్యవధి 50 నిమిషాలు.

also read: JEE – Advanced – 2023: మారిన సిలబస్‌తో అడ్వాన్స్‌డ్‌!


రెండో దశ.. టెక్నికల్‌ ఇంటర్వ్యూ
ఆన్‌లైన్‌ టెస్ట్‌లో సంస్థ నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని తదుపరి దశ టెక్నికల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశలో ఐటీ రంగానికి సంబంధించిన అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి, అకడమిక్‌ నేపథ్యం ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యాలను పరీక్షిస్తారు.

చివరగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ
టెక్నికల్‌ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి చివరగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,నాయకత్వ లక్షణాలను,సాఫ్ట్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలోనూ విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి.. ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు. 

also read: IT Crisis: షేర్‌చాట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింత.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న కంపెనీలు..!


రాత పరీక్షలో విజయం ఇలా
తొలి దశగా నిర్వహించే రాత పరీక్షలో.. 3 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అవి..

వెర్బల్‌ ఎబిలిటీ
యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ది ఎర్రర్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, క్లోజ్‌ టెస్ట్, వెర్బల్‌ అనాలజీస్, సెంటెన్స్‌ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పదో తరగతి స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా సెంటెన్స్‌ ఫార్మేషన్, కరెక్షన్, కాంప్రహెన్షన్‌ల కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్స్‌ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

also read: Government Jobs after B.Tech: బీటెక్‌తో త్రివిధ దళాల్లో కొలువులు


రీజనింగ్‌ ఎబిలిటీ
ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్‌ రిలేషన్స్, అనాలజీ, సిరీస్, పజిల్స్, లెటర్‌ సిరీస్, వెన్‌ డయాగ్రమ్స్, విజువల్‌ రీజనింగ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

న్యూమరికల్‌ ఎబిలిటీ
ఈ విభాగంలో ఫ్రాక్షన్స్,ప్రాబబిలిటీ, సిరీస్‌ అండ్‌ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా, స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, వర్క్‌ అండ్‌ టైమ్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, నంబర్‌ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎం, పర్సంటేజెస్‌ వంటి ప్యూర్‌ మ్యాథ్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వడం కోసం 12వ తరగతి స్థాయిలో ప్యూర్‌ మ్యాథ్స్, అదే విధంగా అర్థమెటిక్‌ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 50 సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

also read: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..


రిజిస్ట్రేషన్‌ ఇలా

  • టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌–2023కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకో సం https://nextstep.tcs.com/campus/#/ లో లాగిన్‌ ఐడీ,పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఐటీ, బీపీఎస్‌ విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న విభాగంపై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత దశలో ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అదే విధంగా నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సమయంలోనే టెస్ట్‌ సెంటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే అభ్యర్థులకు కన్ఫర్మేషన్‌ వస్తుంది.
  • ఆ తర్వాత పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందుగా వారికి కేటాయించిన టెస్ట్‌ సెంటర్‌ వివరాలను తెలియజేస్తారు.

టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌–2023.. ముఖ్య తేదీలు

  •      ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023
  •      ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: ఫిబ్రవరి 10, 2023
  •      పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023
  •      ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌:https://nextstep.tcs.com/campus/#/

also read: TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!

Published date : 24 Jan 2023 02:43PM

Photo Stories