Skip to main content

CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం

ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకుంటే.. సీయూఈటీ యూజీ(సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-అండర్‌ గ్రాడ్యుయేట్‌)లో అర్హత సాధించాలి. గత ఏడాది నుంచి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఒకే ఒక్క పరీక్షతో 54 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందొచ్చు. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి మే 21 నుంచి 31 వరకు సీయూఈటీ యూజీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. సీయూఈటీ-యూజీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం..
CUET UG 2023
  • సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సీయూఈటీ-యూజీ
  • మే 21 నుంచి 31 వరకు సీయూఈటీ-యూజీ పరీక్షలు
  • రెండు స్లాట్లలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష 
  • ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌!

సీయూఈటీ-యూజీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 54 సెంట్రల్‌ యూని వర్సిటీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సీయూఈటీ-యూజీ స్కోర్‌ ప్రామాణికం. కేంద్రీయ విశ్వవిద్యాలయాల తోపాటు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌), ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, బీఎంఎల్‌ ముం జాల్‌ యూనివర్సిటీ తదితర మరో 50కు పైగా  డీమ్డ్, ప్రైవేట్‌ యూనివర్సిటీలు కూడా సీయూఈ టీ-యూజీ స్కోర్‌ ఆధారంగానే గతేడాది ప్రవేశాలు కల్పించాయి. 

50 శాతం మార్కులు తప్పనిసరి!

ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులు, 2023 ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీయూఈటీ యూజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సీయూఈటీ-యూజీకి ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సరిపోతుందని ఎన్‌టీఏ వర్గాలు పేర్కొన్నాయి. కానీ.. పలు సెంట్రల్‌ యూనివర్సి టీలు మాత్రం ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు లో 50 శాతం మార్కులు తప్పనిసరి అంటున్నా యి. కాబట్టి విద్యార్థులు ముందుగానే ఆయా వర్సిటీల ప్రవేశ అర్హతల నిబంధనలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. 

చ‌ద‌వండి: Admissions in Central university: సీయూఈటీకి.. సిద్ధం కావాలి ఇలా

గత ఏడాది 44 వర్సిటీలు

సీయూఈటీ-యూజీ స్కోర్‌ ఆధారంగాగతేడాది 44 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించా రు. యూజీసీ తాజా గణాంకాల ప్రకారం-సెంట్రల్‌ యూనివర్సిటీల సంఖ్య 54కు పెరిగింది. అంటే.. ఈ ఏడాది విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఏపీలో సెంట్రల్‌ యూనివ ర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివ ర్సిటీ, సాంస్క్రిట్‌ యూనివర్సిటీ, తెలంగాణలో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లు ఉన్నాయి. 

రెండు స్లాట్లు.. మూడు సెక్షన్లు

  • గతేడాది సీయూఈటీ-యూజీ పరీక్షను రెండు స్లాట్లలో, మూడు విభాగాలుగా నిర్వహించారు. మొదటి స్లాట్‌ 3:15 గంటలు; రెండో స్లాట్‌ 3:45 గంటల వ్యవధిలో జరిగింది. 2023కి సంబందించి కూడా ఇదే విధానంలో పరీక్ష ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
  • జాతీయ స్థాయిలో నిర్వహించే సీయూఈటీ- యూజీ పరీక్ష తీరును పరిశీలిస్తే.. అభ్యర్థుల్లోని లాంగ్వేజ్‌ స్కిల్స్, అదే విధంగా తాము బ్యాచి లర్‌ డిగ్రీలో చేరాలనుకుంటున్న సబ్జెక్ట్‌పై అవగాహనను పరీక్షించేలా డొమైన్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. 

స్లాట్‌-1 పరీక్ష విధానం

  • స్లాట్‌-1లో సెక్షన్‌-1ఎ(లాంగ్వేజెస్‌), సెక్షన్‌-2 (డొమైన్‌ సంబంధిత సబ్జెక్టులు)లలో  50 ప్రశ్న లకుగాను 40 ప్రశ్నలకు సమాధానం గుర్తించా ల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటాయి.
  • సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌లో 75 ప్రశ్నలకు గాను 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

స్లాట్‌-2 పరీక్ష విధానం

  • రెండో స్లాట్‌లో సెక్షన్‌-1బి(లాంగ్వేజెస్‌)కి సం బంధించి.. సెక్షన్‌1ఎలో ఎంచుకున్న భాష కాకుం డా వేరే భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. 
  • రెండో స్లాట్‌లో లాంగ్వేజెస్‌ విభాగాలు (సెక్షన్‌-1ఎ, 1బి), డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌ విభాగం(సెక్షన్‌-2) మాత్రమే ఉంటాయి. స్లాట్‌-1లో పేర్కొన్న సెక్షన్‌-3(జనరల్‌ టెస్ట్‌) స్లాట్‌-2లో ఉండదు.
  • రెండు స్లాట్స్‌లోనూ డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో అభ్యర్థులు డిగ్రీలో తాము చేరదల చుకున్న కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తికి ప్రాధాన్యం

  • అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ స్లాట్‌కు, ఏ విభాగాలకు హాజరవ్వాలనుకుంటు న్నారో తెలియజేయాల్సి ఉంటుంది.
  • తాము డిగ్రీలో చేరదలచుకున్న కోర్సు ఆధారంగా డొమైన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు.
  • డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌లు 27 అందుబాటులో ఉన్నాయి. మొదటి స్లాట్‌లో గరిష్టంగా రెండు, రెండో స్లాట్‌లో గరిష్టంగా నాలుగు డొమైన్‌ సం బంధిత సబ్జెక్ట్‌లకు హాజరయ్యే అవకాశముంది. 

చ‌ద‌వండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..

గరిష్టంగా 9 టెస్ట్‌లు

  • అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు గరిష్టంగా తొమ్మిది టెస్ట్‌లకు హాజరవ్వచ్చు. 
  • సెక్షన్‌-1ఎ, 1బి లాంగ్వేజ్‌ టెస్ట్‌ల నుంచి రెండు లాంగ్వేజ్‌లు, సెక్షన్‌-2లో గరిష్టంగా ఆరు డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌లు, సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌. 
  • సెక్షన్‌-1ఎ,1బిలు కలిపి గరిష్టంగా మూడు లాం గ్వేజ్‌లు, సెక్షన్‌-2(డొమైన్‌ సబ్జెక్ట్‌) నుంచి గరి ష్టంగా 5 డొమైన్‌ సబ్జెక్ట్‌లు, సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌.
  • అభ్యర్థులు ఈ రెండు విధానాల్లో ఆసక్తి ఉన్న విధానాన్ని దరఖాస్తు సమయంలో పేర్కొంటే.. దాని మేరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
  • స్లాట్‌-1 పరీక్షలో సెక్షన్‌-1ఎ నుంచి గరిష్టంగా ఒక లాంగ్వేజ్‌ టెస్ట్, సెక్షన్‌-2 (డొమైన్‌ సం బంధిత సబ్జెక్ట్‌)లో గరిష్టంగా రెండు సబ్జెక్ట్‌లు, సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక్కో విభాగానికి 45 నిమిషాలు చొప్పున గరిష్టంగా 195 నిమిషాలు(3:15 గంటలు) సమయం అందుబాటులో ఉంటుంది.
  • స్లాట్‌-2లో సెక్షన్‌-1ఎ, బి నుంచి ఒక లాంగ్వేజ్, సెక్షన్‌-2లో గరిష్టంగా నాలుగు డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌ టెస్ట్‌లు లేదా.. సెక్షన్‌-1ఎ,బి నుంచి రెండు లాంగ్వేజెస్, సెక్షన్‌-2 నుంచి మూడు డొమైన్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. అంటే..స్లాట్‌-2లో అభ్యర్థుల ఆసక్తి మేరకు గరిష్టంగా అయిదు టెస్ట్‌లకు హాజరవ్వచ్చు.

సెక్షన్‌-1ఎ లాంగ్వేజ్‌లు

  • ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.
  • సెక్షన్‌-1బి లాంగ్వేజ్‌లు: అరబిక్, బోడో, చైనీస్, డోంగ్రి, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలి, పర్షియన్, సంథాలి, సింధి, స్పానిష్, టిబెటిన్, సంస్కృతం.

చ‌ద‌వండి: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

డొమైన్‌ సబ్జెక్ట్‌లు:

     మొత్తం 27 డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. అవి.. 

  • అకౌంటెన్సీ/బుక్‌ కీపింగ్‌ 
  • బయాలజీ/బయలాజికల్‌ స్టడీస్‌/ బయోటె క్నాలజీ/బయో కెమిస్ట్రీ 
  • బిజినెస్‌ స్టడీస్‌ 
  • కెమి స్ట్రీ 
  • కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌ 
  • ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌ 
  • ఇంజనీ రింగ్‌ గ్రాఫిక్స్‌ 
  • ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ 
  • జాగ్రఫీ/ జియాలజీ 
  • హిస్టరీ 
  • హోమ్‌ సైన్స్‌ 
  • నాలెడ్జ్‌ ట్రెడిషన్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌ ఆఫ్‌ ఇండియా 
  • లీగల్‌ స్టడీస్‌ 
  • ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ 
  • మ్యాథమెటి క్స్‌ 
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ఎన్‌సీసీ/యోగా 
  • ఫి జిక్స్‌ 
  • పొలిటికల్‌ సైన్స్‌
  • సైకాలజీ 
  • సోషియా లజీ 
  • టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 
  • అగ్రికల్చర్‌ 
  • మాస్‌ మీడియా/ మాస్‌ కమ్యూనికేషన్‌ 
  • ఆంత్రోపా లజీ 
  • ఫైన్‌ ఆర్ట్స్‌/విజువల్‌ ఆర్ట్స్‌ 
  • పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ 
  • సంస్కృతం.

ఈ అంశాలపై ప్రశ్నలు

  • సెక్షన్‌-1ఎ, 1బి లాంగ్వేజ్‌లలో రీడింగ్‌ కాం ప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్‌లో లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీలలో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. 
  • సెక్షన్‌-2లోని డొమైన్‌ సంబంధిత సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాల ఆధారంగా ఆయా సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌లో.. జనరల్‌ నాలెడ్జ్, కరెం ట్‌ అఫైర్స్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమ రికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, లాజి కల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.

చ‌ద‌వండి:  Job Opportunities: అగ్రికల్చర్‌ కోర్సులు.. అందించేను అవకాశాలు

మెరుగైన స్కోర్‌కు మార్గాలు

  • విద్యార్థులు ఇంటర్మీడియెట్, పదో తరగతి స్థాయి అకడమిక్‌ పుస్తకాలను ఔపోసన పట్టాలి. 
  • డొమైన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను చదవాలి.

CUET UG 2023 – ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ సమర్పణ: 09 ఫిబ్రవరి నుండి 12 మార్చి 2023 వరకు (రాత్రి 09:00 గంటల వరకు)
  • క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్-బ్యాంకింగ్/UPI ద్వారా రుసుము విజయవంతమైన లావాదేవీకి చివరి తేదీ: 12 మార్చి 2023 (11:50 P.M. వరకు)
  • పర్టిక్యులర్స్ లో దిద్దుబాటు: 15 మార్చి నుండి 18 మార్చి 2023 వరకు (11:50 P.M. వరకు)
  • పరీక్ష నగరం ప్రకటన: 30 ఏప్రిల్ 2023
  • NTA వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయడం: మే 2023 రెండవ వారం 
  • పరీక్ష తేదీ: 21 మే 2023 నుండి 31 మే 2023 వరకు (రిజర్వ్ తేదీలు: 01 నుండి 07 జూన్ 2023 వరకు)
  • రికార్డ్ చేయబడిన ప్రతిస్పందనలు మరియు జవాబు కీల ప్రదర్శన: వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటించాలి
  • NTA వెబ్‌సైట్‌లో ఫలితాల ప్రకటన
Published date : 14 Feb 2023 11:21AM

Photo Stories