Intermediate: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
Sakshi Education
ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 23న విడుదల కానున్నాయి.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బో ర్డు ఇన్ చార్జ్జ్ కార్యదర్శి వి. రామకృష్ణ అక్టోబర్ 22న ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఈ ఫలితాలు అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రామకృష్ణ పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు 'https:bie.ap.gov.in' ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్ ను 'ourbieap@gmail.com' ద్వారా లేదా 9391282578 వాట్సాప్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
For Results - Click Here
చదవండి:
Published date : 23 Oct 2021 03:17PM