Intermediate Admissions: ఇంటర్మీడియట్ కళాశాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు..
![School admission exam notice for Intermediate First Year Online admissions are open for Intermediate students 2024-25 academic year admission exam notification for Intermediate First Year](/sites/default/files/images/2024/02/19/intermediate-online-admissions-1708324667.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, గ్రూపుల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి మల్లి(పీటీజీ –బాలురు0, జోగింపేట (బాలురు) విశాఖపట్నం(బాలికలు)కళాశాలల్లో జరగనున్న ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నామని జోగింపేట గిరిజన ప్రతిభా విద్యాలయం ప్రిన్సిపాల్ పోల వెంకటినాయుడు ఒక ప్రకటనలో కోరారు.
Students without Cellphones: విద్యార్థులు సెల్‌ఫోన్‌లు వాడుకూడదని అవగాహన పెంచాలి..!
అలాగే ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదేశాల మేరకు 2024–25 విద్యా సంవత్సరానికిగాను జోగింపేట (బాలురు), విశాఖపట్నం(బాలికలు)ప్రతిభా పాఠశాలల్లో 8వ తరగతిలో ప్రవేశానికి జరగబోయే పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
62 DSPs Transferred Across The State- భారీగా డీఎస్పీల బదిలీలు..హాట్ టాపిక్‌గా మారిన వరుస ఉత్తర్వులు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వారు, లక్షరూపాయల వార్షికాదాయం కంటే తక్కువ కలిగి, గిరిజన బాల,బాలికలై ఉండేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి అర్హులని పేర్కొన్నారు. దఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోడానికి ఆఖరు తేదీ 25.3.2024, అని ప్రవేశ పరీక్ష తేదీ 7.4.2024న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ జరుగుతుందని స్పష్టం చేశారు.
దరఖాస్తు ఫారాలను ఆన్‌లైన్‌లో లేదా గురుకులం వెబ్‌సైట్‌లో ఏపీటీడబ్ల్యూగురుకులం.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్.ఐఎన్‌లో సమర్పించి హాల్‌టికెట్ తీసుకోవాలని వివరించారు.