Skip to main content

Indian Railway Jobs: 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. అప్లై చేశారా..?

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) భారతీయ రైల్వేకు సంబంధించి ట్రాక్‌మెన్‌ నుంచి గెజిటెడ్‌ పోస్టుల వరకూ టెక్నికల్, నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టిన విష‌యం తెలిసిందే..
Railway Engineer Inspecting Tracks   RRB ALP 2024 Notification Out for 5696 Posts    Railway Recruitment Board

దేశవ్యాప్తంగా రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఇటీవ‌ల‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవ‌చ్చు.  రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
 
మొత్తం ఖాళీల సంఖ్య: 5696

కేటగిరీ పోస్టులు:  యూఆర్‌- 2499; ఎస్సీ- 804; ఎస్టీ- 482; ఓబీసీ- 1351; ఈడబ్ల్యూఎస్‌- 560; ఎక్స్‌ఎస్‌ఎం- 572.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీ ఖాళీలు ఇవే.. 
1. అహ్మదాబాద్- 238
2. అజ్‌మేర్- 228
3. బెంగళూరు- 473
4. భోపాల్- 284
5. భువనేశ్వర్- 280
6. బిలాస్‌పూర్- 1,316
7. చండీఘడ్‌- 66
8. చెన్నై- 148
9. గువాహటి- 62
10. జమ్ము అండ్‌ శ్రీనగర్- 39
11. కోల్‌కతా- 345
12. మాల్దా- 217
13. ముంబయి- 547
14. ముజఫర్‌పూర్- 38
15. పట్నా- 38
16. ప్రయాగ్‌రాజ్- 286
17. రాంచీ- 153
18. సికింద్రాబాద్- 758
19. సిలిగురి- 67
20. తిరువనంతపురం- 70
21. గోరఖ్‌పూర్- 43 

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసుండాలి. మెకానికల్‌(Mechanical), ఎలక్ట్రికల్‌(Electrical), ఎలక్ట్రానిక్స్‌(Electrical), ఆటోమొబైల్‌(Automobile) ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. అంతే కాకుండా ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ప్రశ్నా పత్రం వివరాలు ఇవే..
సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది. 75 ప్రశ్నలు, 75 మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. మ్యాథ్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లోప్రశ్నలు వస్తాయి. 
సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి. 
పార్ట్‌-ఏ: విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు
పార్ట్‌-బీ: విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి.

చదవండి: Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌-సర్మీస్‌మెన్‌, మహిళలకు రూ.250. ఇతరులకు రూ.500.
వయసు: 01-07-2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవ‌త్స‌రాలు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

వేత‌నం: నెల‌కు రూ.19,900 నుంచి రూ.63,200 

ఎంపిక విదానం: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్(CBT)లో మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20-01-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 19-02-2024
దరఖాస్తు మార్పుకు అవకాశం: 20-02-2024 నుంచి 29-02-2024 వరకు.
సీబీటీ-1 పరీక్ష: జూన్‌-ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం.
సీబీటీ-2 పరీక్ష: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
సీబీఏటీ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in/
ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://www.recruitmentrrb.in/#/auth/landing

 

Published date : 19 Feb 2024 01:08PM
PDF

Photo Stories