Skip to main content

RRB Recruitment : ఆర్‌ఆర్‌బీలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ పోస్టులు..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ(గ్రాడ్యుయేట్‌) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
NTPC Graduate Posts at Railway Recruitment Board   RRB Non-Technical Popular Category recruitment 2024  Railway Recruitment Board invites applications for 8,113 NTPC posts  Apply for RRB NTPC Graduate posts in all Railway Zones RRB recruitment notification for Non-Technical Popular Category jobs Total 8,113 RRB NTPC posts for graduates in 2024

»    మొత్తం పోస్టుల సంఖ్య: 8,113.
»    ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్మూ–శ్రీనర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
»    పోస్టుల వివరాలు: కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌–1,736, స్టేషన్‌ మాస్టర్‌–994, గూడ్స్‌ రైలు మేనేజర్‌–3,144, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌–1,507, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌–732.
»    రీజియన్ల వారీగా ఖాళీలు: ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌–478, ఆర్‌ఆర్‌బీ బెంగళూరు–496, ఆర్‌ఆర్‌బీ చెన్నై–436, ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్‌–758.
Contract Teaching Posts : రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
»    అర్హత: 
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌/సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌/హిందీలో టైపింగ్‌ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.
»    వయసు: 01.01.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    ప్రారంభ వేతనం: నెలకు చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌/స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులకు రూ.35,400. ఇతర పోస్టులకు రూ.29,200.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(టైర్‌–1, టైర్‌–2), టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండు దశల్లో పరీక్ష జరుగుతుంది. 
»    మొదటి దశ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు కేటాయించారు. జనరల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), మ్యాథ్స్‌(30 ప్రశ్నలు–30 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (30 ప్రశ్నలు–30 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    రెండో దశ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌: మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు కేటాయించారు. జనరల్‌ అవేర్‌నెస్‌(50 ప్రశ్నలు–50 మార్కులు), మ్యాథ్స్‌(35 ప్రశ్నలు–35 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(35 ప్రశ్నలు–35 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.10.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 25.10.2024 వరకు
»    వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 11:38AM

Photo Stories