Success Story : లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే చ‌దివా.. గ్రూప్‌-1 కొట్టానిలా..

పక్షి కన్నుకు గురిపెట్టిన అర్జునుడి విల్లులా.. లక్ష్యంవైపు ముందుకు సాగాలి.. అప్పుడే విజయం సొంతమవుతుంది అని అంటున్నారు డీఐజీ, హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ జాయింట్‌ సీపీ మస్తిపురం రమేశ్‌రెడ్డి.
Masthipuram Ramesh Reddy, IPS officer

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే స్థిర చిత్తం ఉండాలి.. అలా కాకుండా పుస్తకం చేతిలో.. మనసు ఎక్కడో.. ఉంటే ఏమీ సాధించలేం. ముందుగా లక్ష్యాన్ని ఎలా సాధించాలన్న స్పష్టత తెచ్చుకోవాలి.. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నేను గ్రూప్‌-1 ఆఫీసర్‌గా విజయం సాధించ‌డానికి.. వేసుకున్న ప్లాన్‌.. మొద‌లైన‌వి మీకోసం..

APPSC Group 1 Ranker Sreenivasulu Raju : గ్రూప్‌-1 స్టేట్ 2nd ర్యాంక‌ర్ స‌క్సెస్ స్టోరీ..|| నేను చదివిన పుస్తకాలు ఇవే..

కుటుంబ నేప‌థ్యం :
మాది మహబూబ్‌నగర్‌ జిల్లా మస్తీపురం. వ్యవసాయ కుటుంబం. 

ఎడ్యుకేష‌న్ :
నేను ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో, ఇంటర్మీడియట్‌ నాగార్జునసాగర్‌లో చదివాను. అందరిలా మూసలో కాకుండా ముందు నుంచి నాకు నచ్చిన విధానాన్నే అనుసరించాను. అనుసరిస్తున్నాను. ఇదే నా విజయాల్లో నాకు ఉపయోగపడింది.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

లైఫ్‌లో అన్నీ ఎంజాయ్‌ చేస్తూనే..
ఇంటర్మీడియట్‌లో అందరు ఎంపీసీ, బైపీసీలనే ఎక్కువ ఎంచుకునేవాళ్లు. నాకు మ్యాథ్స్​‍, సైన్స్​‍ అంతగా రావు. కాబట్టి సీఈసీ తీసుకున్నాను. లైఫ్‌లో అన్నీ ఎంజాయ్‌ చేస్తూనే చదువును కూడా అంతే బాధ్యతగా చదివాను. ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాను. 

ఫస్ట్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ తర్వాత స్టేట్‌ ర్యాంకు సాధించగలుగుతాననే నమ్మకం వచ్చింది. దీంతో మా వాళ్లకు చెప్పి మరీ స్టేట్ ఫస్ట్‌ ర్యాంకు కొట్టాను. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే.. ఎవరితోనూ పోలికలు లేకుండా.. ఒక విషయాన్ని ఇష్టంగా నేర్చుకుంటే అందులో తప్పకుండా విజయం సాధించవచ్చని. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోడిమల్‌ కాలేజీలో బీఏ హానర్స్​‍ చేశాను.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

నేను గ్రూప్‌-1 వైపుకు.. 

ఎంఏ చివరి ఏడాదిలో ఉండగానే గ్రూప్‌-1 రావడంతో అది పూర్తి చేయలేదు. ఒకసారి సివిల్స్​‍ రాశాను. అదే టైంలో గ్రూప్స్​‍ నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పటి కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం తప్పక చేయాల్సిన పరిస్థితి. అందుకే గ్రూప్‌-1 పై దృష్టిపెట్టాను. 1993 నోటిఫికేషన్‌ 1994లో ప్రిలిమ్స్​‍, మెయిన్స్​‍ జరిగాయి. 1995 మార్చిలో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. స్టేట్‌ 9వ ర్యాంకు వచ్చింది. నెల తర్వాత రిజల్ట్స్‌ వచ్చింది. పాత నోటిఫికేషన్‌కు సంబంధించిన కేసుల కారణంగా కొంత లేటయ్యింది. అదేవిధంగా మా నోటిఫికేషన్‌ నుంచే మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి తెచ్చారు. దీంతో ఆర్డీవో కావాల్సిన వాడిని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చాను.

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..

ఏ విజయం సాధించాలన్నా మన శక్తిని గుర్తించాలి. బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ మీడియంలో చదివినా తెలుగు అంటే ఎంతో ప్రేమ. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా తెలుగును సెకండ్‌ లాంగ్వేజ్‌గా తీసుకున్నాను. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాష అన్నది ఇంటర్నెట్‌లో ఒక ప్రోగ్రాంకు కోడ్‌ లాంగ్వేజ్‌ లాగా ఉపయోగపడుతుంది.

ఎగ్జామే వదిలేద్దాం అనుకున్నా..


గ్రూప్‌-1 మెయిన్స్​‍ ఆప్షన్స్​‍లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, తెలుగు సాహిత్యం తీసుకున్నాను. తెలుగు సాహిత్యం అనంతమైంది. చాలా లోతుగా వెళ్లాలి. బాగా ప్రిపేరయ్యాను. అయినా ఎగ్జామ్‌ ముందు రోజు రాత్రి ఎంతో ఒత్తిడికి లోనయ్యా.. ఎంతలా అంటే ఎగ్జామే వదిలేద్దాం అనేకునేంతగా. ఇంతవరకు వచ్చాం, ఏదయితే అదయిందని భయంగానే పరీక్ష హాలుకు వెళ్లాను. కానీ చదువుకున్న అంశాలే ఎంతో సులువుగా అడిగారు. బాగా పరీక్ష రాసి ఉద్యోగం సాధించాను. అందుకే ముందస్తు భయాలు ఎప్పుడూ పెట్టుకోకూడదని, ధైర్యంగా ఎదుర్కోవాలని పరీక్ష తర్వాత తెలిసొచ్చింది. మనపై మనం ఆత్మవిశ్వాసం పెట్టుకోవాలి.

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..

ఇలా చ‌దివితే  అసలుకే మోసం వస్తుంది.. 
ఈసారి అభ్యర్థులకు గొప్ప అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. కాబట్టి కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది. మార్కెట్‌లో అవసరానికి మించి మెటీరియల్‌ అందుబాటులో ఉంది. వాటన్నింటిని చూస్తూ గందరగోళపడకూడదు. ముందుగా సిలబస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి కావాల్సిన మెటీరియల్‌ను సేకరించుకోవాలి. పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులను సంప్రదించాలి. సబ్జెక్టుల వారీగా ఎంపిక చేసుకోవాలి. వాటిల్లో కనీసం రెండు సోర్స్​‍ల నుంచి మెటీరియల్‌ ఎంపిక చేసుకుని, అదే చదవాలి. మధ్యలో ఏదో కొత్తది వచ్చిందని దానిని చదివితే అయోమయంలో పడి అసలుకే మోసం వస్తుంది. అందుకే స్థిర చిత్తంగా ఉంటేనే.. విజయం సాధిస్తాం.

APPSC Group1 Ranker Aravind Success Story : గ్రూప్‌–1 ఆఫీసర్‌ కావాలని కలలు కన్నాడు.. అనుకున్న‌ట్టే సాధించాడిలా..

దీనికి దూరంగా ఉంటే..
ప్రిపరేషన్‌ టైంలో సోషల్‌ మీడియా, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. సెల్‌ఫోన్‌లో పడితే మనకు తెలియకుండానే గంటల సమయం వృథా అవుతుంది. ఆన్‌లైన్‌లో, యూ ట్యూబ్‌లో క్లాసులు వరకు వింటే మంచిదే. వేరే వాటి జోలికి వెళితే.. సెల్‌ఫోన్‌ భవిష్యత్తుకు చెరుపు చెస్తుంది. స్టడీ విషయంలోనే అనే కాదు.. ఏ విషయంలోనైనా సెల్‌ఫోన్‌ అవసరం మేరకే ఉపయోగించుకోవాలి. లేకుంటే జీవితం అధోగతే.

ఏ పోటీ పరీక్షలోనైనా..

అంతేకాకుండా ప్రిపరేషన్‌ టైంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశం. తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. యోగా మెడిటేషన్‌ చేయాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. చదువుకునేటప్పుడు బాగా నీళ్లు తాగాలి. అది చాలా ముఖ్యం. వీలైనంత వరకు బయటి తిండి, పార్టీలు, ఫంక్షన్లు మానుకోవడం ఉత్తమం. దానివల్ల సమయం వృథాకాకుండా ఉంటుంది. సబ్జెక్ట్‌ను అర్థం చేసుకుంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతే గ్రూప్‌-1తో పాటు ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చు.

APPSC Group1 Ranker Success Story : వార్డు సచివాలయ ఉద్యోగి.. డీఎస్పీ ఉద్యోగానికి ఎంపిక‌.. ఓట‌మి నుంచి..

#Tags