Skip to main content

APPSC Group1 Ranker Success Story : వార్డు సచివాలయ ఉద్యోగి.. డీఎస్పీ ఉద్యోగానికి ఎంపిక‌.. ఓట‌మి నుంచి..

ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
APPSC Group1 Ranker Success Story
APPSC Group1 Ranker Success Story

2018 డిసెంబర్‌లో మొత్తం 167 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన సాబాజ్‌ అహ్మద్‌ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
కర్నూలు జిల్లా ఆదోని న్యూ చైతన్యకాలనీలో నివాసముంటున్న బషీర్‌అహ్మద్, సహనాజ్‌బేగం దంపతుల కుమారుడు సాబాజ్‌ అహ్మద్‌.  

ఎడ్యుకేష‌న్ : 
1వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు మిల్టన్‌ పాఠశాల, ఇంటర్‌ జ్యోతిర్మయి జూనియర్‌ కళాశాలలో చదివిన సాబాజ్‌ అహ్మద్‌ 2015లో  ఎమ్మిగనూరులోని ఎర్రకోట సెయింట్‌జాన్స్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించాడు.  

గ్రూప్‌-1 కొట్టాడిలా..
రెండేళ్లపాటు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. 2017లో గ్రూప్‌–1 రాసినా ఫలితం దక్కలేదు. కుంగిపోకుండా మరింత పట్టుదలతో చదివాడు. అనుకున్న‌ట్టే గ్రూప్‌-1లో విజ‌యం సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు. గ్రూప్‌–1 పోస్టు సాధించిన సాబాజ్‌ అహ్మద్‌ సచివాలయ ఉద్యోగిగా ఉండటం విశేషం. పట్టణంలో హౌసింగ్‌బోర్డు కాలనీ  సచివాలయంలో అడ్మిన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

APPSC Group-1 Ranker Sreeram Chandra Success : కిరోసిన్ బుడ్డి వెలుతురులో చ‌దివా.. ఎన్నో బాధ‌లు భ‌రించి గ్రూప్‌-1 కొట్టానిలా..

రెండోసారి..
రెండోసారి 2018లో గ్రూప్‌–1 పరీక్ష రాశాడు. ఇందులో విజయం సాధించి డీఎస్పీ పోస్టుకు ఎంపియ్యాడు. గ్రూప్‌–1 ఆఫీసర్‌గా సామాజిక న్యాయం, మహిళల రక్షణ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సాబాజ్‌అహ్మద్ ‘సాక్షి’తో తెలిపారు.

తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు.

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..

ఇంటర్వ్యూలను..
2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

APPSC Group-1 Ranker Bharath Nayak Success Story : భరత్‌ అనే నేను.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

Published date : 02 Aug 2022 05:43PM

Photo Stories