Skill Hub: స్కిల్‌ హబ్‌ పేరిట శిక్షణ, ఉపాధి అవకాశాలు..

విశాఖ కేంద్రంగా జరుగుతున్న పారిశ్రామికీకరణతో భవిష్యత్‌లో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.

విశాఖ విద్య: 2024–25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 15 పాలిటెక్నికల్‌ కాలేజీలు ఉండగా, వీటిలో అన్ని బ్రాంచిలు కలిపి 17,465 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Degree Semester Results: ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

విశాఖ కేంద్రంగా జరుగుతున్న పారిశ్రామికీకరణతో భవిష్యత్‌లో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరిగింది. మూడేళ్లలో చేతికొచ్చే డిప్లమో సర్టిఫికెట్‌తో ఉపాధి లేదా ఉద్యోగం పొందటం లేదంటే, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాలు ఉండటంతో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

AP Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

నూరుశాతం సీట్ల భర్తీపై ఫోకస్‌

విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కాలేజీ జిల్లాకు నోడల్‌ కేంద్రంగా పనిచేస్తోంది. దీనితో పాటు భీమునిపట్నం (బాలికలు), ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ (విశాఖ), పెందుర్తిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో మరో 11 కాలేజీలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా 6,730 సీట్లు అందుబాటులో ఉండగా, 2023–24 విద్యా సంవత్సరంలో 4006 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరారు. ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి నూరుశాతం సీట్లు భర్తీ అయ్యేలా సాంకేతిక విద్యాశాఖ పక్కా కార్యాచరణతో ముందుకు వెళుతోంది.

Intermediate Exams 2024: ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే

ఎన్‌బీఏ రేసులో ప్రభుత్వ కాలేజీలు

ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఏటా వసతులు, అర్హత గల ఫ్యాకెల్టీ, ప్లేస్‌మెంట్‌ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సాంకేతిక విద్య అందించే కాలేజీలకు ‘నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడియేషన్‌’ (ఎన్‌బీఏ) గుర్తింపు ఇస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీ–డిజైన్‌ చేసుకునేందుకు వీలుగా ఈ గుర్తింపు ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కాలేజీల్లో పెందుర్తి మినహా మిగత మూడు కాలేజీలు ఎన్‌ఏబీ రేసులో ఉండటంతో వీటిలో చేరేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

Intermediate Exams 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

స్కిల్‌ హబ్‌తో చెంతకే ఉద్యోగాలు

నైపుణ్యంతో కూడిన చదువులకు పెద్దపీట వేస్తోన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పక్కా కార్యాచరణతో ముందుకువెళుతోంది. విశాఖ, పెందుర్తి, భీమునిపట్నం పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ‘స్కిల్‌హబ్‌’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో పేరొందిన పారిశ్రామిక సంస్థలు నేరుగా కాలేజీలకు వచ్చి, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వటంతో పాటు, కోర్సు అనంతరం వారిని ఉద్యోగాల్లోకి సైతం తీసుకుంటున్నాయి. ఉపాధి గ్యారెంటీ ఏర్పాట్లతో ప్రభుత్వ కాలేజీలకు క్రేజ్‌ పెరిగింది.

Eamcet Results: ఎంసెట్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

నైపుణ్యంతో కూడిన శిక్షణ

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులు అభ్యశించేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులు ఉన్నాయి. నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తున్నాం. మా పెందుర్తి కాలేజీలో మూడు పారిశ్రామిక సంస్థలు ముందస్తు ఒప్పందం చేసుకొని క్యాంపెస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈ ఏడాది అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

 –డాక్టర్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ పాలిటెక్నిక్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, విశాఖపట్నం

Corporate Education: పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత ప్రవేశాల అవకాశం..!

అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ధ

పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతి విద్యార్హతతో ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మా కాలేజీలో పూర్తి స్థాయిలో వసతులు, సీనియర్‌ ఫ్యాకెల్టీ ఉన్నారు. ఎన్‌బీఏ గుర్తింపు రేసులో ఉన్నాం. ఈ సారి అన్నిబ్రాంచిల్లో సీట్లు భర్తీ అయ్యేలా అధ్యాపకులకు బాధ్యతలు అప్పగించాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా శ్రద్ధ తీసుకుంటున్నాం.

 –డాక్టర్‌ కె.నారాయణరావు, ప్రిన్సిపాల్‌, విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ

Osmania University: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం

#Tags